- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవించే హక్కును కాలరాస్తోన్న ప్రభుత్వం : హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా టెస్టుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అత్యున్యత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల జీవించే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన నివేదికలు సమర్పించకపోతే కోర్టు ధిక్కరణ చర్యగా భావిస్తామని తీర్పులో పేర్కొంది. ఆర్‌ఏడీ బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఉన్నత న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక మీదట 10నిమిషాల్లో రిజల్ట్ వచ్చే కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, మూడు రోజుల్లో 50వేలు టెస్టులు చేస్తామని కొద్దిరోజుల కిందట చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని..అసలు టెస్టులే చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మే 23 నుంచి జూన్ 23వరకు ఎన్నిటెస్టులు చేశారు? ప్ర్రైమరీ, సెకండెరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? డాక్టర్లు, సిబ్బందికి ఎన్ని పీపీఈ కిట్లు ఇచ్చారో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్నిఆదేశించింది. అంతేకాకుండా జూలై 17న ప్రభుత్వం అందించే నివేదికతో కోర్టు సంతృప్తి చెందకపోతే..20న సీఎస్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది.కాగా, ధర్మాసనం ఉత్తర్వులపై తెలంగాణ సర్కారు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దాం.