ఎప్పటికైనా ఆ కోరికను తీర్చుకుంటా

by Anukaran |   ( Updated:2020-07-25 11:47:54.0  )
ఎప్పటికైనా ఆ కోరికను తీర్చుకుంటా
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యాబాలన్.. హాట్ ఫోజులతో పాటు హాట్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచే ఈ బాలీవుడ్ బ్యూటీ కొత్త దారులు వెతుకుతోంది. మలయాళ సినీ ఇండస్ట్రీలో ఐరన్‌లెగ్ అని పేరొందిన విద్యాబాలన్.. బాలీవుడ్‌లో మాత్రం ఏకంగా ‘డర్టీ పిక్చర్‌’చూపెట్టి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అప్పటి నుంచి విద్యాబాలన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దాదాపు 40 ఏండ్లకు చేరువల్లో ఉన్న ఈ బ్యూటీ.. హాట్ ఆంటీ గా అభిమానుల నుంచి పేరు సంపాదించుకుంది. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. బాలీవుడ్‌లో ఈ బ్యూటీకి ఓ స్థానం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రస్తుతం ఈ స్పీడ్ స్టార్ జీవిత కథలపై ఎక్కువగా మొగ్గు చూపుతుంది. డర్టీ పిక్ఛర్‌లో సిల్క్ స్మిత పాత్రలో అందాలు ఆరబోసిన విద్యాబాలన్.. తాజాగా మానవ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతల దేవి బయోగ్రఫీలో నటిస్తోంది. ఇటీవల మిషన్ మంగల్ సినిమాలో అద్భుత నటనతో ఆకట్టుకుంది. అయితే, ఈ అమ్మడుకు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర పోషించాలనేది చిరకాల కోరిక అని మనసులో మాట బయటపెట్టేసింది. ఇందిరా గాంధీ సినిమాను తెరకెక్కిస్తే ఆ పాత్ర చేయడం కష్టమని చెప్పిన విద్యా బాలన్.. ఆ పాత్ర చేయడమే తన చిరకాల కోరిన అని అసలు విషయం చెప్పింది.

Advertisement

Next Story