మంచిర్యాలలో ‘మహానటి’.. CMR షాపింగ్ మాల్ ప్రారంభం

by Aamani |
మంచిర్యాలలో ‘మహానటి’.. CMR షాపింగ్ మాల్ ప్రారంభం
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా గల రామరాజేశ్వరి కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటైన సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను శుక్రవారం నటి కీర్తిసురేశ్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో 45వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగంతస్తుల సువిశాలమైన స్వర్ణ, వస్త్ర షాపింగ్ మాల్ ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసిన మహానటి ఆ తర్వాత మాల్‌ను ప్రారంభించారు.

అనంతరం మాల్ ముందు ఏర్పాటు చేసిన స్టేజి ఎక్కి అభిమానులకు అభివాదం చేశారు. రాష్ట్రంలో సీఎంఆర్ 11వ షోరూం ప్రారంభానికి రావడం ఆనందంగా ఉందన్నారు. మంచిర్యాలలో అందరూ మంచి వారే ఉన్నారని, ఇలాంటి ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం నటి కీర్తి సురేశ్, ప్రొగ్రేటర్ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలతో ప్రారంభమై విలువైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

పిల్లల నుంచి పెద్దల వరకు ఆకర్షణీయమైన వస్త్రాలున్నాయన్నారు. మిగతా షోరూంల కన్నా తక్కువ ధరకు తమ వద్ద లభిస్తాయన్నారు. సకుటుంబ సమేతంగా షాపింగ్ చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా నటి కీర్తిసురేశ్ షోరూం అంతా తిరిగి బట్టలను పరిశీలించారు. చీరలను కప్పుకొని చూశారు. అనంతరం భీమ్లా నాయక్ పాటతో ఫేమస్ అయిన కిన్నెర వాయిద్యకారుడు మొగిలియ్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. కిన్నెరతో భీమ్లా నాయక్ పాట పాడి అందరినీ అలరించాడు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తీన్మార్ ఫేమ్ సావిత్రి (శివజ్యోతి) వ్యాఖ్యాతగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళింది. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, రాజేశ్ గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story