తగ్గేది లేదంటున్న స్వీటీ

by Anukaran |   ( Updated:2020-08-03 04:54:47.0  )
తగ్గేది లేదంటున్న స్వీటీ
X

‘సూపర్’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు బ్యూటీ అనుష్క శెట్టి(స్వీటీ).. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కెరీర్ మొదట్లో గ్లామరస్ పాత్రలకే పరిమితమైన స్వీటీ.. ‘అరుంధతి’ సినిమా నుంచి లేడీ ఓరియెంటెడ్ రోల్స్‌‌కు కేరాఫ్‌గా నిలిచింది. ఈ క్రమంలో తెలుగు, తమిళ చిత్రాల్లో లీడ్ హీరోయిన్‌గా కొనసాగింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి 1,2 చిత్రాలు అనుష్క అసమాన ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ప్రస్తుతం అనుష్క లీడ్ రోల్‌లో నటించిన ‘నిశ్శబ్దం’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

బాహుబలి తర్వాత సెలెక్టెడ్‌గా మూవీస్‌ చేస్తున్న అనుష్క.. ప్రస్తుతం తమిళ్‌లో రూపుదిద్దుకుంటున్న ఓ పాన్ ఇండియా మూవీలో నటించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందులో మక్కల్ సెల్వన్ విజయ సేతుపతి హీరోగా నటించనుండగా.. ఆయనకు జోడీగా అనుష్కను అడిగినట్లు సమాచారం.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో తన రోల్‌కు రూ.3 కోట్లు అడిగినట్లు తెలుస్తోంది. అయితే, అంతమొత్తాన్ని ఇవ్వడానికి దర్శక, నిర్మాతలు నిరాకరించగా తాను బహుభాషా నటినని, తన చిత్రాలకు తెలుగు, తమిళ్ తదితర భాషల్లో మంచి ఆదరణ ఉంటుందని స్వీటీ చెప్పినట్టు టాక్. పైగా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేది లేదని అనుష్క కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ‘హీరో విజయ్ సేతుపతికి రూ.పది కోట్లు ఇచ్చినప్పుడు తనకు మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం న్యాయమే’ అనడంతో దర్శక, నిర్మాతలు కన్విన్స్ అయినట్టు సమాచారం. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్టు కరోనా పరిస్థితులు చక్కబడి, లాక్‌డౌన్ పూర్తయ్యాకే స్టార్ట్ కానుంది.

Advertisement

Next Story