- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మెగాస్టార్ అల్లుడికి కరోనా పరీక్షలు..

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా సినిమా షూటింగ్‌లు మొత్తం ఆగిపోయాయి. కాగా ఇప్పుడిప్పుడే కోలుకుని షూటింగ్ మొదలు పెడుతున్న సినిమాలు సైతం కరోనా కలకలం మూలంగా మళ్లీ ఆగిపోతుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు, సీరియల్స్ ప్రారంభించి, ఆగిపోయాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ మాత్రం షూటింగ్ చేసొచ్చాడు. ప్రభుత్వం అనుమతి వచ్చిన తర్వాత ఆయన నటిస్తున్న సూపర్ మచ్చి సినిమా షూటింగ్ చేసాడు. టాలీవుడ్‌లో ఇప్పటికే ప్రారంభించిన ఒకట్రెండు సినిమా షూటింగ్స్‌లో ఇది కూడా ఒకటి. విజేత తర్వాత ఈయన నటిస్తున్న రెండో సినిమా ఇది. అయితే షూటింగ్‌కు వెళ్లొచ్చిన తర్వాత ఈయన వెంటనే స్వయంగా వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఇంట్లో భార్యా పిల్లలు ఉండటంతో ముందు వెళ్లి టెస్టులు చేయించుకుని, నెగిటివ్ వచ్చిన తర్వాత తర్వాత ఇంటికి వచ్చానని ఇన్‌స్టాలో పోస్ట్ చేసి తెలిపారు.