- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ టైం.. ప్రజలకు ఉపయోగపడే సైట్స్ ఇవే..
దిశ, ఫీచర్స్ : ఇండియాలో కొవిడ్ కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. రికవరీ రేట్ ఎక్కువగానే ఉన్నప్పటికీ, మరణాల సంఖ్య తక్కువేం లేదు. ఈ నేపథ్యంలో మహమ్మారికి బలి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను స్ట్రిక్ట్‌గా పాటించాల్సిందే. అయితే ఢిల్లీలో పరిస్థితులు చేయిదాటిపోతుండగా.. తాజాగా అక్కడ వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. ఈ మేరకు అనారోగ్యంతో ఉన్నవారికి అవసరమైన వనరులు అందేలా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు పోర్టల్స్ కూడా ఏర్పాటు చేశారు. హెల్త్ కేర్ ఇన్‌స్టిట్యూట్స్ సైతం ఈ కఠిన సమయాల్లో తమ మద్దతును విస్తరించాయి. అయితే మెడికేషన్స్, రెమిడెసివిర్ లభ్యత, ప్లాస్మా దాతల వివరాలను ఎలా చూడాలో తెలుసుకునే టిప్స్ మీకోసం.
ఇంటి వద్దే టెస్టింగ్ :
ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకోలేని వారి కోసం కొన్ని ఆన్‌లైన్ సైట్స్ ద్వారా 'టెస్ట్' బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. వాటికి సంబంధించిన లింక్స్ ఈ కింద ఉన్నాయి.
రెమిడెసివిర్ కోసం :
కరోనా కష్ట సమయంలో నిజాల కంటే అవాస్తవాలే నెట్టింట్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ క్రమంలోనే రెమిడెసివర్ మందు అందుబాటులో లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు రెమిడెసివిర్ ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవడానికి కొన్ని కంపెనీలు ఆ లిస్ట్‌ను అందుబాటులో ఉంచాయి.
ప్లాస్మా దాతలు..
రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై కొవిడ్-19 వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, వారి శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌పై రోగనిరోధక కణాలు (తెల్ల రక్త కణాలు) దాడి చేసి నాశనం చేస్తాయి. అందుకే, కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధిచెంది ఉంటుంది. అయితే, రోగనిరోధక శక్తి లేని వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకవేళ వారి శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనే వీలుంటుంది. అందుకు పరిష్కారంగా, కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి అదే వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే 'ప్లాస్మా థెరపీ' అంటారు. ఈ క్రమంలోనే చాలామంది సోషల్ మీడియాలో ప్లాస్మా డోనర్స్ కావాలని మెసేజ్‌లు పెడుతున్నారు. కాగా ప్లాస్మా దాతల వివరాలు తెలిపే సైట్ల వివరాలు, ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ప్లాస్మా దాతల వివరాల కోసం కింది లింక్స్ ఉపయోగకరంగా ఉంటాయి.
వర్చువల్ డాక్టర్
కొవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా కూడా కరోనా బాధితులకు, ఇతరులకు సలహాలు, సరైన మెడికేషన్ అందించడానికి డాక్టర్లు వర్చువల్‌గా అందుబాటులో ఉంటున్నారు. ఆ డాక్టర్ల కన్సల్టేషన్‌ను ఈ కింది లింక్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.