అందుకు వ్యాక్సిన్ ఒకటే మార్గం!

by Harish |   ( Updated:2020-07-06 05:35:28.0  )
అందుకు వ్యాక్సిన్ ఒకటే మార్గం!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు తగ్గితేనే ఆర్థిక పునరుద్ధరణ సాధ్యపడుతుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ ఛైర్మన్ హెన్రీ మెక్‌కినెల్ అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లిందని, లాక్‌డౌన్ దెబ్బకు ఆర్థిక కార్యకలాపాలు పూర్తిస్థాయిలో స్తంభించిపోవడంతో నిరుద్యోగం సైతం పెరిగిపోయిందని హెన్రీ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాక్సిన్ వీలైనంత త్వరలో వస్తుందని ఆశిస్తున్నామని, కానీ వాస్తవానికి ఊహించిన సమయం కంటే కాస్త ఆలస్యంగా వచ్చేలా కనబడుతోందని హెన్రీ తెలిపారు. భారత్ లాంటి అధిక జనాభా ఉన్న దేశంలో భౌతిక దూరం కష్టమని, కరోనాను అధిగమించేందుకు వ్యాక్సిన్ ఒకటే మార్గమని హెన్రీ స్పష్టం చేశారు. కరోనా వైరస్ దేశ ఆర్థిక పునరుద్ధరణ వేగాన్ని నిర్ణయిస్తుందని, కరోనా వైరస్ నియంత్రణ ఆర్థిక కార్యకలాపాల వేగానికి పెద్ద సవాలుగా నిలువనుందని హెన్రీ పేర్కొన్నారు. కాగా, మూడీస్ సంస్థ భారత్ క్రెడిట్ రేటింగ్‌ను బీఏఏ3కి తగ్గించింది, అలాగే నెగెటివ్ ఔట్‌లుక్‌ను కొనసాగించింది.

Advertisement

Next Story

Most Viewed