- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాహ్.. వృద్ధులకు ఆన్‌లైన్ క్లాసులు
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వృద్ధ తరం బాగా ఇబ్బంది పడుతోంది. చిన్న చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడడం అనివార్యంగా మారింది. అయితే ఎవరూ వాళ్ల అవసరాలను తీర్చేందుకు ముందుకు రావడం లేదు. కనీసం మందులు కూడా తెచ్చిచ్చేందుకు ఇష్టపడడం లేదు. దాంతో సంక్షోభ కాలం ఈ వృద్ధతరాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కుటుంబ సభ్యుల్లోనూ కరోనా వైరస్ భయం వెంటాడుతోన్న నేపథ్యంలో సహకరించలేక పోతున్నారు. ఇక ఒంటరిగా ఉంటోన్న వృద్ధులు, వృద్ధ దంపతులు వారి బిడ్డలు, కొడుకులతో మాట్లాడుకునేందుకు అవకాశం లేకుండా పోతోంది.
ఇదంతా సాంకేతిక అవగాహన లేని వారికే.. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం జేబులో ఉన్నట్లేనని గుర్తించిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ ఏటీఎం కేంద్రానికి వెళ్లి నగదును డ్రా చేసుకునే వీల్లేదు. ఆన్‌లైన్‌లో కొనే శక్తి లేదు. నగదు రహిత లావాదేవీలను నడిపేందుకు సైబర్ నేరగాళ్ల ముప్పు పొంచి ఉన్నది. ఈ క్రమంలో టెక్నికల్ నాలెడ్జ్ పొందడం తప్పనిసరి. రానున్న కాలంలోనూ 60 ఏండ్లకు పైబడిన వాళ్లు బయట తిరిగే పరిస్థితులు వస్తాయో రావో అంతుచిక్కని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ ఈ వృద్ధులకు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు తరగతులు నిర్వహిస్తోంది. అంతా ఉచితంగా చేపట్టింది. ఇప్పటికే తెలంగాణలో 2 వేల మందికి పైగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఒక్క ఫోన్ చేసి పేరు చెప్పి వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు.. గూగుల్ సంస్థ సహకారంతో శిక్షణ ఇస్తామని హెల్ప్ ఏజ్ ఇండియా తెలంగాణ, ఏపీ అడ్వకసీ ఆఫీసర్ శ్యాంకుమార్ గురువారం ‘దిశ’కు వివరించారు. నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’. ఈ సందర్భంగా సంస్థ అందిస్తోన్న ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు
సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించు కోవాలనుకునే వాళ్లు, ఆసక్తి కలిగిన వాళ్లు హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థకు 18001801253 నంబరుకు ఫోన్ చేయాలి. వారి పేరు, ఫోన్ నంబరు చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని అడ్వకసీ ఆఫీసర్ శ్యాంకుమార్ తెలిపారు. డిజిటల్ లిటరసీ ఆన్‌లైన్ క్లాసులను మూడు వారాల పాటు నిర్వహిస్తాం. ఒక్కొక్క సెషన్ రెండు గంటల పాటు ఉంటుంది. గూగుల్ సంస్థ బృందం పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఎలాంటి సందేహాలు ఉన్నా తీర్చుకోవచ్చునన్నారు.
శిక్షణలో ప్రధాన అంశాలు
వృద్ధులకు అవసరమైనవి
– క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం.
– ఆన్‌లైన్‌లో చెల్లింపులు.
– ఆన్‌లైన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో నిత్యావసర వస్తువులను ఆర్డర్ ఇవ్వడం
– ఆన్‌లైన్‌లో మందులు ఆర్డర్ ఇవ్వడం, సరి చూసుకోవడం.
– కెమెరాలు వినియోగించడం. ఫొటోలు, వీడియోలు తీయడం, చూడడం, సేవ్ చేయడం
– ఫోన్ స్టోరేజీ మేనేజ్మెంట్.
– వెబ్ కెమెరాను వినియోగించడం.
– సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవడం.
– ఈ మెయిళ్లను క్రియేట్ చేసి ఉత్తరప్రత్యుత్తరాలు, ఫిర్యాదులు చేయడం.
– క్యాబ్ బుకింగ్స్, లొకేషన్ షేర్ చేయడం.
– యాప్స్ ద్వారా చెల్లించేటప్పుడు జాగ్రత్తలు పాటించడం
– సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా స్ట్రాంగ్ పాస్‌వర్డులను క్రియేట్ చేసుకోవడం.
– అవసరమైన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం.
నేను నేర్చుకున్నా.. : ఎ.లక్ష్మీనారాయణ, సరూర్‌నగర్, హైదరాబాద్
నేను నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్‌లో 5 రాష్ట్రాల్లో 35 ఏండ్ల పాటు పని చేసి 2006లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి సీనియర్ సిటిజన్ అసోసియేషన్లలో పని చేస్తున్నా. ఎంతో మంది నాకు పీఏలు, సబ్ స్టాఫ్ ఉండేది. కానీ కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. కరోనా కాలంలో డిజిటల్ నాలెడ్జ్ అవసరం తప్పనిసరైంది. అయితే హెల్ప్ ఏజ్ ఇండియా ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఎంతో నేర్చుకున్నా. డిజిటల్ లిటరసీ తరగతులను నిర్వహించడం చాలా బాగుంది. గూగుల్ సహకారంతో పెద్దవాళ్లకు శిక్షణ ఇవ్వడం అభినందనీయం. ఇప్పుడు జూమ్ యాప్‌లో మీటింగ్ అటెండ్ అవుతున్నాను. వాట్సాప్, ఈమెయిల్స్ వాడుతున్నాను. ఓలా, ఉబెర్ క్యాబ్‌లు బుక్ చేస్తున్నా. పేమెంట్లు ఎలా చేయాలో తెలుసుకున్నా. ఆన్‌లైన్‌లో షాపింగ్ కూడా చేస్తున్నాను. ఎవరి సహకారం లేకుండానే అన్ని పనులు చేసుకోగలుగుతున్నా.
డిజిటల్ లిటరసీలో పాల్గొన్నా.. : ఎస్.గీత
హెల్ప్ ఏజ్ ఇండియా నిర్వహించిన డిజిటల్ లిటరసీ క్లాసులకు హాజరయ్యాను. మూడు సెషన్స్‌లో చాలా వరకు అవగాహన తెచ్చుకున్నా. డిజిటల్ టూల్స్ ఎలా వాడాలో అర్థమైంది. స్మార్ట్ ఫోన్ ద్వారా కరెంటు, నీటి బిల్లులను చెల్లిస్తున్నా. మొబైల్ రీచార్జ్ చేసుకోగలుగుతున్నా. అమెజాన్, ఫ్లిప్‌కార్టుల్లో నిత్యావసర వస్తువులను ఆర్డర్ చేసుకుంటున్నా. ఆన్‌లైన్ లావాదేవీలను కూడా చేసేస్తున్నా. పేటీఎం, గూగుల్ పే కూడా వాడుతున్నా. వృద్ధులకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఇతరుల మీద ఆధారపడడం తగ్గుతుంది.