హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

by Shyam |   ( Updated:2020-10-19 02:06:54.0  )
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌ను ముంచెత్తిన అతి భారీ వర్షం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోకముందే మళ్లీ అలాంటి భారీ వర్షం పడుతోంది. సోమవారం బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్, మల్లాపూర్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, తార్నాకలో భారీ వర్షం కురుస్తోంది. గత రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన పలు ప్రాంతాలు.. ఇప్పటికీ ముంపులోనే కొనసాగుతున్నాయి. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మళ్లీ వర్షం పడుతుండటంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story