బ్రేకింగ్ న్యూస్.. శ్రీరామ్ సాగర్‌కు పోటెత్తుతున్న వరద

by Aamani |   ( Updated:2021-07-15 04:12:29.0  )
బ్రేకింగ్ న్యూస్.. శ్రీరామ్ సాగర్‌కు పోటెత్తుతున్న వరద
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 1 లక్ష 86 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1082.70 అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 56.020 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉదయం 6 గంటలకు 85,785 క్యూసెక్కుల వరద రాగా.. మూడు గంటల్లో వరద రెట్టింపు అయింది. బుధవారం మహారాష్ట్రలోని గోదావరి పైన ఉన్న విష్ణుపూరి ప్రాజెక్ట్ 7 గేట్లు, బలేగాన్ ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో బాబ్లీ గేట్లు మొత్తం ఎత్తి ఉండటంతో నేరుగా వరద శ్రీరాం సాగర్ లోకి వచ్చి చేరుతోంది.

మంజీరా నది ప్రవాహం పెరగడంతో నీరు వస్తుంది. గత ఏడాది ఇదే రోజు ప్రాజెక్ట్‌లో 33.976 టీఎంసీల నీరు ఉండగా.. ఈ ఏడాది రెండింతల నీరు ఉంది. శ్రీరాం సాగర్ కు రెండు లక్షల వరకు వరద వస్తే ఈ వారం రోజుల్లో నే ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉంది. గురువారం నిర్మల్ జిల్లా ఆయకట్టుకు సరస్వతి కాలువ ద్వారా నీరు వదిలే కార్యక్రమం భారీ వర్షం కారణంగా వాయిదా వేసినట్టు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed