సింగూర్ జ‌లాశ‌యంలో భారీగా వ‌ర‌ద నీరు..

by Shyam |
సింగూర్ జ‌లాశ‌యంలో భారీగా వ‌ర‌ద నీరు..
X

దిశ‌, అందోల్: ఉమ్మడి మెద‌క్ జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం, జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా జ‌లాశ‌యంలోకి వ‌ర‌ద ప్రవాహం కొన‌సాగుతోంది. ప్రాజెక్టు సామ‌ర్థ్యం 29.97 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 29.09 టీఎంసీల నీరు నిల్వకు చేరింది. ఎగువ నుంచి వ‌ర‌ద ప్రవాహం కొన‌సాగుతుండ‌డంతో అప్రమ‌త్తమైన అధికారులు ప్రాజెక్టులోని 6,9,11 గేట్లను 2 మీట‌ర్ల ఎత్తుతో పైకెత్తి దిగువ‌కు నీటిని వ‌దులుతున్నారు. ప్రాజెక్టులోని 34,600 క్యూసెక్కులు నీటిని దిగువ‌కు వ‌దలుతుండ‌గా, ప్రాజెక్టులోకి 25,100 క్యూసెక్కుల నీరు వ‌చ్చి చేరుతోంది.

ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువ‌కు నీటిని వ‌దులుతున్నందున మంజీరా ప‌రివాహ‌క ప్రాంతాల గ్రామాల‌ు అప్రమ‌త్తంగా ఉండాల‌ని అధికారులు ముంద‌స్తుగా సమాచారాన్ని అందించారు. మ‌త్య్సకారుల‌ను సైతం చేప‌ల వేట‌కు వేళ్లకూడ‌ద‌ని హెచ్చరిస్తున్నారు. ఈ సీజ‌న్‌లో ప్రాజెక్టు నుంచి 11 టీఏంసీల నీటిని దిగువ‌కు వ‌దిలామ‌ని, ఇప్పటివ‌ర‌కు 24 టీఏంసీల వ‌ర‌కు నీరు వ‌ర‌ద రూపంలో వ‌చ్చింద‌ని అధికారులు చెబుతున్నారు. వ‌ర‌ద ప్రవాహం కొన‌సాగితే మ‌రో గేటును ఎత్తే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో ప‌ర్యాట‌కుల సంద‌డి మొద‌లైంది. ప్రాజెక్టుపైకి పర్యాట‌కుల‌ను అనుమ‌తించకుండా చ‌ర్యలు తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed