ఒక్కోసారి మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా.. అయితే కారణం ఇదేనేమో?

by samatah |
ఒక్కోసారి మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా.. అయితే కారణం ఇదేనేమో?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. గతంలో 45 సంవత్సరాలలోపు ఉన్నవారికే ఎక్కువ హార్ట్ ఎటాక్ వచ్చేది. కానీ ఇప్పుడు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటుతో మరణించడం ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో వైద్యులు.. మంచి ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని, ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదంటూ చెప్పుకొస్తున్నారు.

అయితే కొంత మందికి గుండె అకస్మాత్తుగా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. దీనివలన ఏమైనా అంతుందేమో అని టెన్షన్ తీసుకుంటారు. అసలు గుండె ఎందుకు ఒక్కోసారి వేగంగా కొట్టుకుంటుంది. దాన్ని ఏమంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె వేగంగా కొట్టుకోవడాన్ని టాకీకార్డియా అంటారంటే, శరీరంలోని ఇతర అవయవాలకు రక్తం సరఫరా అయ్యేందుకు ఒక రకమైన ఎలక్ట్రికల్ ఇంపల్స్ సహాయపడుతాయి. ఈ విద్యుత్ ప్రవాహంలో ఏవైనా తేడాలు వస్తే గుండే అకస్మాత్తుగా వేగంగా కొట్టుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే న్యుమోనియా, ఊపిరితిత్తుల్లో బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ రావ‌డం, లంగ్ క్యాన్స‌ర్ వంటి ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది.

అయితే ఇలా గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడానికి కారణం మనం తీసుకునే ఆహారమే అంటున్నారు వైద్యులు. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి సమస్య నుంచి బయటపడవచ్చంట.

1. చాలా మంది కెఫిన్ అధికంగా తీసుకుంటుంటారు. అయితే కెఫిన్ అధికంగా తీసుకోవడం వలన రక్తపోటు పెరుగుతుందంట. అందువలన కెఫిన్‌కు దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు.

2. అలాగే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం వలన ఈ సమస్యనుంచి బయటపడవచ్చు.

Advertisement

Next Story

Most Viewed