గుండెపోటు వ‌చ్చిన వ్య‌క్తి ఈ డైట్ తీసుకోగానే నాలుక‌పై వెంట్రుక‌లు మొలిచిన‌య్‌..!!

by Sumithra |   ( Updated:2023-12-15 16:33:13.0  )
గుండెపోటు వ‌చ్చిన వ్య‌క్తి ఈ డైట్ తీసుకోగానే నాలుక‌పై వెంట్రుక‌లు మొలిచిన‌య్‌..!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః జీవ‌న‌శైలితో వ‌చ్చిన మార్పుల వ‌ల్ల‌ ర‌క‌ర‌కాల రోగాలు, దానికి అనేక ర‌కాల కొత్త ర‌కం డైట్‌లు వ‌స్తున్నాయి. అయితే, డైట్ ఎలాంటిదైనా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ సీరియ‌స్‌గానే ఉంటాయి. కేర‌ళ‌కు చెందిన 50 ఏళ్ల ఓ వ్య‌క్తి విష‌యంలో ఇలాగే జ‌రిగింది. ఇటీవ‌ల గుండె పోటు వ‌చ్చిన కార‌ణంగా ఆయ‌న‌ ప్యూరీ డైట్‌ను ఫాలో అయ్యాడు. అయితే, ప‌రిశుభ్ర‌త‌ను ప‌క్క‌కు పెట్ట‌డంతో నాలుక నల్లగా మారి, మందపాటి కార్పెట్‌లా త‌యార‌య్యింది. వెంట్రుక‌లు మొలిచి భ‌యంక‌రంగా మారింది.

కేరళలోని కొచ్చిన్ ప్రాంతానికి చెందిన‌ మెడికల్ ట్రస్ట్ హాస్పిటల్‌ వైద్యులు "జామా డెర్మటాలజీ జర్నల్‌"లో ఈ ఆసక్తికర కేసును వివరించారు. గుండెపోటు వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న ఎడ‌మ‌భాగానికి పెరాల‌సీస్ రావ‌డంతో సాధార‌ణ ఆహారం తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌య్యింది. దీనితో లిక్విడ్ ఫుడ్‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం ప్రారంభించిన ఈ వ్య‌క్తి నోటిని శుభ్రం చేసుకోవ‌డంపై శ్ర‌ద్ధ పెట్ట‌లేదు. కాగా, నాలుకపై డెడ్ స్కిన్, బ్యాక్టీరియా త‌యార‌య్యి, మందపాటి వెంట్రుక‌ల లేయ‌ర్‌ అభివృద్ధి చెందింది. అయితే, ఆశ్చర్యకరంగా వైద్యులు అత‌నికి ప్ర‌త్యేక ప‌రీక్ష‌లేమీ చేయ‌లేదు. స‌రిక‌దా, సాధార‌ణ వైద్య చికిత్స‌నే అందించారు.

కార‌ణం, "నల్ల వెంట్రుకల నాలుక"ను వైద్యపరంగా "లింగువా విల్లోసా నిగ్రా" అని పిలుస్తారు. రోజూ నాలుకను ప‌రిశుభ్రంగా ఉంచుకోక‌పోవ‌డం వ‌ల్ల ఈ ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఓరల్ మెడిసిన్ ప్రకారం, 13 శాతం మంది పెద్దల్లో త‌మ‌ జీవితకాలంలో ఈ పరిస్థితి వ‌స్తుంది. నాలుక‌పైన నల్లటి వెంట్రుకలు రావ‌డం అనేది తాత్కాలికం, అలాగే అది హానిచేయదు. నోటిని, నాలుక‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుంటే కొన్ని రోజుల‌కు అది న‌య‌మైపోతుంది.

Advertisement

Next Story