కాకరకాయ గింజలు అసలు పడేయకూడదు.. ఎందుకంటే..?

by Kalyani |
కాకరకాయ గింజలు అసలు పడేయకూడదు.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: చాలామంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే కాకరకాయ కూర కొంచెం చేదుగా ఉంటుంది. కానీ కాకరకాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే చాలామంది కాకరకాయ కూర వండేటప్పుడు కాకర గింజలను పడేస్తుంటారు. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు. కాకరగింజల్లో ఇంకా పోషకాలు ఎక్కువగా ఉండడం వలన వ్యాధుల నుంచి దూరం చేస్తాయి.

ఇవి రక్తంలో చక్కెర, గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలని తగ్గిస్తాయి. డయాబెటిక్ పేషెంట్లలో మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ గింజలు ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కాకరకాయ గింజలని క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటిని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. దీంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed