- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఆ సినిమాలో నటించక పోవడానికి కారణం అదే’.. విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, సినిమా: విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కాంబోలో వచ్చిన 'విడుదల-1'కి సీక్వెల్‌గా వస్తున్న సినిమా 'విడుదల-2'. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత, శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల బిజీలో ఉన్నారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా హీరో విజయ్ సేతుపతి, హీరోయిన్ మంజు వారియర్ ఆదివారం హైదరాబాద్‌కు విచ్చేసి.. మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి.. ‘గేమ్ ఛేంజర్’ మూవీలో తాను నటిస్తున్న అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ..‘ప్రస్తుతం నేను ఇతర సినిమాల్లో బిజీగా ఉన్నాను. పైగా ఈ సినిమా కథ నాకు తెలుసు కానీ నాకు తగ్గ పాత్ర ఈ మూవీలో సరిపోయేలా లేదు అంటూ విజయ్ సేతుపతి కీలక కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా ‘గేమ్ ఛేంజర్’ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్నది. అయితే ఈ చిత్రంలో అంజలి, సునీల్, సముద్ర ఖని, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.