కరోనా వ్యాక్సిన్ వల్లనే గుండెపోటు వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే?

by samatah |   ( Updated:2023-03-06 08:25:26.0  )
కరోనా వ్యాక్సిన్ వల్లనే  గుండెపోటు వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం భారతదేశంలో గుండెపోటుతో చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఇక 40 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ హార్ట్ ఎటాక్ వలన మరణించడం కాస్త ఆందోళనకు గురిచేస్తుంది.ఇక తెలంగాణలో ఒక్క రోజే గుండెపోటుతో ఐదుగురు మరణించడంతో ప్రజలు వణికిపోతున్నారు.

అయితే కొందరు గుండె పోటు రావడానికి కారణం కోవిషీల్డ్ వ్యాక్సినే కారణం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వ్యాక్సిన్ వేసుకోవడం వలన 40 ఏళ్లలోపు పిల్లలందరూ హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారు, అసలు వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నామంటూ భయపడిపోతున్నారు. `అయితే దీనిపై ప్రముఖ కార్డియాలజిస్టులు తమ అభిప్రయాలను తెలియజేశారు.

హార్ట్ ఎటాక్స్ పెరగడానికి వ్యాక్సిన్లు కారణం అనేలా డేటా ఏదీ లేదు అని డాక్టర్ బల్బీర్ తెలిపారు. వ్యాక్సిన్ వలన అని చెప్పలేం కానీ, కరోనా సోకిన సమయంలో ట్రీట్ మెంట్ తీసుకున్న వారు స్టెరాయిడ్స్ వాడారు. వాటి వలన గుండె పోటు వవచ్చే అవకాశం ఉందంటూ తెలిపారు.

అలాగే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ముంబైలోని ఇన్ఫెక్షన్ వ్యాధుల నిపుణుడు డాక్టర్ విక్రాంత్ షా మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ల వలన గుండెపోటు వస్తుంది అనేదానికి సిద్దాంత పరంగా వివరణలేదు. ఇలాంటి ఆరోపణలు రుజువు చేయడానికి ఆధారాలు లేవు కాబట్టి భయపడాల్సిన పనిలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story