- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏళ్లు గడిచినా ఎక్స్ పైరీ డేట్ దాటని వస్తువులు ఏంటో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్ : మనం బయట ఏదైనా వస్తువులను కొనుగోలు చేస్తే ముందుగా ఎక్స్ పైరీ తేదీని చూసి కొనుగోలు చేస్తాం. ఎక్స్ పైరీ అయిన వస్తువులు ఇంట్లో ఉన్నా వాటిని బయట పారేస్తాం. ఎందుకంటే గడువు తేది అయిపోయిన వస్తువుల్లో ఆరోగ్యానికి హాని కలిగించే బాక్టీరియా పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుందని అందరికీ తెలిసిందే. అయితే మనం కొనుగోలు చేసే కొన్ని వస్తువులు సంవత్సరాలు గడిచినా ఎలాంటి గడువు తేది ఉండదు. అలాగే ఎన్నిరోజులైనా పాడవకుండా ఉంటాయి. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటి, వాటికి ఎందుకు ఎక్స్ పైరీ ఉండదు ఇప్పుడు తెలుసుకుందాం..
బియ్యం..
ఆహారం లేనిదే మనిషికి బతుకు లేదు. చాలా మంది ఏడాదికి సరిపడా బియ్యాన్ని పంటచేతికి రాగానే కొనిపెట్టుకుంటారు. బ్రౌన్ రైస్, తెలుపు, బాస్మతి బియ్యం ఏండ్ల తరబడి ఉన్నా బియ్యం పై దుమ్ము పొర ఏర్పడుతుంది కానీ వాటి గడువు ముగియదు. సరైన పద్ధతిలో బియ్యాన్ని ఉంచితే ఏండ్ల తరబడి నిలువ ఉంటాయి.
బీన్స్..
నాణ్యత కలిగిన ఎండిన బీన్స్‌కు ఎక్స్ పైరీ ఉండదు. నాణ్యమైన బీన్స్‌ను ఏండ్ల తరబడి నిలువ ఉంచి వండినప్పుడు అవి కాస్త గట్టిగా ఉంటాయి. బీన్స్‌ను ఎన్ని సంవత్సరాలు స్టోర్ చేసినా వాటిలో పోషకాలు మాత్రం అస్సలు తగ్గవు.
తెలుపు వెనిగర్..
చాలా మంది కొన్ని వంటలలో వైట్ వెనిగర్‌ని వాడతారు. వెనిగర్‌ని ఎక్కువ మోతాదులో వాడరు కాబట్టి దాన్ని నెలల తరబడి నిలువ ఉంచుతారు. వెనిగర్‌ని నెలల తరబడి స్టోర్ చేసినా అది పాడవదు.
మొక్కజొన్న పిండి..
ఈ పిండిని చాలా వరకు ఫాస్ట్ ఫుడ్‌లో వినియోగిస్తారు. ఈ పిండిని తేమ లేని, గాలి చొరబడని కంటెనర్‌లో నిల్వ చేస్తే పిండి నెలల తరబడి తాజాగా ఉంటుంది. అలాగే రుచి మారకుండా ఆ పిండితో చేసిన వంటలు టేస్టీగా ఉంటాయి.
తేనె..
ఇది నాచురల్‌గా తేనెటీగల నుంచి వచ్చినది. ఈ తేనెని జాగ్రత్తగా భద్రపరిస్తే అస్సలు పాడవదు. కానీ ఏండ్లు గడిస్తే మాత్రం తేనె రంగు మారి చక్కెరగా మారుతుంది. దీన్ని పారేయకుండా చక్కెరకు బదులుగా వాడవచ్చు.
ఉప్పు..
సముద్రం నుంచి వచ్చిన ఉప్పు కూడా ఏండ్లు గడిచినా అస్సలు పాడవదు. దీనికి కూడా ఎలాంటి ఎక్స్ పైరీ తేది ఉండదు. తేమ, గాలి ఉన్న ప్రదేశాలలో ఉంచితే మాత్రం ఉప్పు నీళ్లలాగా మారుతుంది.