- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amazon Clinic Service: వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన అమెజాన్.. అపాయింట్‌మెంట్ యాప్ ద్వారానే..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్(Amazon) మరో రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 'అమెజాన్ క్లినిక్ సర్వీస్(Amazon Clinic Service)' పేరుతో ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్(Medical Consultation) సేవలను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్లినిక్ సర్వీస్ కేవలం రూ.299తో స్టార్ట్ అవుతుంది. ఈ అమెజాన్ క్లినిక్ ద్వారా 50కి పైగా వ్యాధులకు సంబంధించి వైద్య సమస్యలకు డాక్టర్ కన్సల్టేషన్లను అందించనుంది. డాక్టర్ స్పెషలైజేషన్‌ను బట్టి కన్సల్టేషన్ ఫీజు(Consultation Fee) రూ.299 నుంచి రూ.799 వరకు ఉంటుంది. అమెజాన్ క్లినిక్ సర్వీస్ లో జనరల్ పిజీషియన్, డెర్మటాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, న్యూట్రిషన్, కౌన్సెలింగ్ వంటి వైద్య సేవలున్నాయి.
అయితే కస్టమర్లు ఈ సర్వీస్ పొందాలనుకుంటే అమెజాన్ యాప్ ద్వారా వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. ప్రజెంట్ ఉన్న ప్రాక్టో లాంటి ప్లాట్ ఫార్మ్ ల మాదిరిగానే ఈ సర్వీస్ పని చేస్తుంది. ఆన్‌లైన్ లో వీడియో, ఆడియో, చాట్ ద్వారా వైద్యులతో మాట్లాడవచ్చు. కాగా కస్టమర్లు డాక్టర్ల అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే ముందు కచ్చితంగా పేరు(Name), వయస్సు(Age), జెండర్(Gender), మొబైల్ నంబర్(Mobile Number)తో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కస్టమర్ల వైద్య పరిస్థితిని బట్టి ఆన్‌లైన్‌లో డాక్టర్ నుండి సంప్రదింపులు జరపవచ్చు. అవసరమైతే క్లినిక్‌కి వెళ్లి డాక్టర్ ని కలవవచ్చు. అయితే అమెజాన్ క్లినిక్ సర్వీస్ ప్రస్తుతం ఆండ్రాయిడ్(Android), ఐఓఎస్(iOS) వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాగా ఈ సర్వీస్ ని డెస్క్‌టాప్(Desktop)లో మాత్రం వినియోగించలేరు.