బయ్యారంలో అత్యాధునిక సౌకర్యాలతో హెల్త్ సెంటర్ ప్రారంభం

by Shyam |   ( Updated:2021-10-03 08:46:28.0  )
బయ్యారంలో అత్యాధునిక సౌకర్యాలతో హెల్త్ సెంటర్ ప్రారంభం
X

దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో రాజు క్లినిక్ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జడ్పీ మహబూబాబాద్ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందు, కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదువుకుని గ్రామీణ ప్రాంతంలో ప్రజల ఆరోగ్య సమస్యలకు ఆధునిక వసతులతో చికిత్స అందించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు.

ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు చేరువలో ఉండి అందరి మన్నలను పొందాలని కోరారు. కార్యక్రమంలో ఆంగోత్ బిందు, కోరం కనకయ్య, సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి , నాయకులు ఆంగోత్ శ్రీకాంత్ , జగ్గు తండా సర్పంచ్ బోడ రమేష్ పీహెచ్సీ డాక్టర్ రాజ్ కుమార్, ఎమ్‌పీటీసీ తమ్మిశెట్టి కుమారి, నాయకులు భూక్య ప్రవీణ్, తమ్మిశెట్టి వెంకటపతి, రాచమల్ల నాగేశ్వరరావు, పగడాల శ్రీనివాస్, ఎంపీటీసీ సనప సోమేశ్, ఉపసర్పంచ్ వీరబోయిన కవిత, మండల నాయకురాలు పాల్థియా కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed