అల్లంతో ఆరోగ్యం..

by sudharani |   ( Updated:2021-07-25 20:50:20.0  )
అల్లంతో ఆరోగ్యం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆరోగ్యానికి అల్లం ఎంతో మంచిది. అల్లంలో విటమిన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ లు పుష్కలంగా ఉన్నాయి. వీటి వలన శ్వాస సంబంధ వ్యాధుల రాకుండా ఉండటానికి, పేగుల్లోని గ్యాస్‌ను నివారించడానికి అల్లం ఉపయోగపడుతోంది. ప్రయాణానికి ముందు అల్లం టీ తాగితే వికారం వాంతులు రాకుండా చేస్తోంది. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో అల్లం టీ ఉపయోగపడుతుంది.

భోజనం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే ఆ సమయంలో అల్లం టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే అల్లం టీ తాగాలి. కండరాలు, కీళ్ల సమస్యలకు గృహవైద్యంగా అల్లం టీ పనిచేస్తోంది. అంతే కాకుండా రక్తప్రసరణ మెరుగుపరచడం, హృద్రోగ సమస్యలను నివారించడంలో అల్లం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆకలి కాకుండా ఆహారం సరిగా తీసుకోనప్పుడు, ఆహారం తినడానికి అరగంట ముందు పచ్చి అల్లం ముక్కను కొద్దిగా తినాలి. దాంతో ఆకలి పెరుగుతుంది. అలాగే ఎండిన లేదా పచ్చి అల్లాన్ని కొంచెం నీటితో కలిపి ముద్దగా తయారు చేసి దానిని నుదిటికి రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

Advertisement

Next Story

Most Viewed