వెల్లుల్లి మేలు వెలకట్టలేం

by Shyam |
వెల్లుల్లి మేలు వెలకట్టలేం
X

వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనందరికీ తెలుసు. కరోనా వైరస్ కట్టడికీ కూడా వెల్లుల్లి తినాలని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే వెల్లుల్లి తినడం వల్ల కరోనా వైరస్ చావదు కానీ, ఫ్లూ వంటి జబ్బులు రావు. దీంట్లో ఉన్న యాంటి ఫంగల్, యాంటి యాక్సిడెంట్స్, యాంటీ సెప్టిక్, యాంటి మైక్రోబయల్ గుణాలు మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది.

వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు..

ప్రతి ఒక్కరి వంటిట్లో ఉండే వెల్లుల్లి.. మన ఒంట్లో ఉండే ఎన్నో వైరస్‌లతో పోరాడుతుంది. అందుకే మన ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలని ఆహారనిపుణులు సూచిస్తుంటారు. ఆహార పదార్థాలకు రుచిని మన శరీరానికి ఆరోగ్యాన్ని అందించే వెల్లుల్లిని అద్భుత ఔషధమని చెప్పొచ్చు. తురిమిన వెల్లుల్లి పాయలను తేనెతో కలిపి పరిగడుపున తీసుకోవడం వల్ల మన శరీర రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. వెల్లుల్లిపాయల రసాన్ని ఉదయం తాగడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. కడుపుబ్బరం తగ్గాలన్నా ఉదయంపూట వెల్లుల్లి తినాలని వైద్యులు నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో విటమిన్ సీ అధికంగా ఉండటం వల్ల నోటికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. దగ్గు, జలుబు, తుమ్ములు, అలర్జీలతో సతమతమయ్యేవారికి వెల్లుల్లి మంచి మెడిసిన్. వెల్లుల్లి రసంలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉండడం చేత అలర్జీలను తరిమికొడుతుంది. రక్తపోటుతో బాధపడేవారు వెల్లుల్లి రసాన్ని తీసుకోవచ్చు. రక్తాన్ని శుద్ధి చేసే గుణం వెల్లుల్లిలో ఉంది. గుండె సమస్యలకు దూరంగా ఉండాలంటే ఈ వెల్లుల్లి దివ్య ఔషధం. ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషించగలదు. వెల్లుల్లిలో విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, చక్కెరలు ఉన్నాయి.

వెల్లుల్లితో చర్మ సౌందర్యం

చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో వెల్లుల్లి క్రీయాశీలంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చర్మం నిండా మొటిమలు ఉన్నా, మచ్చలు ఉన్నా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు. వెల్లుల్లి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని ఇన్సులిన్‌ స్థాయి కూడా పెరుగుతుంది. అందువల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రించ గల శక్తి వెల్లులికి ఉంటుంది. వెల్లుల్లి ఏడు వారాల్లో సెరమ్ గ్లూకోజ్‌ని 57 శాతానికి తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. రోజూ ఏదో విధంగా వెల్లుల్లి తింటే ముఖంపై ముడతలు కూడా పడవు. వెల్లుల్లిని కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచగలదు. పెద్దపేగు, రొమ్ము, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్లను నిరోధించటంలో కూడా వెల్లుల్లి కీల‌క పాత్ర పోషిస్తుంది. కడుపులో నులిపురుగుల నివారణకి కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. మన శరీరంలో మెదడు ఎంతో కీలకం. దానికి ఆక్సిజన్తోపాటు విషపూరిత పదార్థాలు చేరే ప్రమాదం ఉంటుంది. బ్రెయిన్‌ని క్లీన్ చెయ్యాలంటే వెల్లుల్లి తినాలి. ఇవి మతిమరపుకి దారితీసే అల్జీమర్స్ వ్యాధి రాకుండా చేస్తాయి. లైంగిక శక్తిని పెంపొందించడంలో కూడా వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. వెల్లుల్లిని అతిగా తినడం కూడా మంచిది కాదు. రోజుకు ఒకటి, రెండు మాత్రమే ఉపయోగించాలి.

Tags: uses of garlic, skin, diabetes, blood

Advertisement

Next Story

Most Viewed