రోజుకి కేవలం ఒక్క జాంకాయ తినండి

by sudharani |   ( Updated:2021-06-23 08:09:43.0  )
రోజుకి కేవలం ఒక్క జాంకాయ తినండి
X

దిశ, వెబ్ డెస్క్: అన్ని రకాల పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు. అయితే, పోషకాలు కలిగిన పండ్లు తినడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అటువంటి పోషకాలు కలిగిన పండ్లలో ముఖ్యమైనది..జామ పండు.. ఆ జామ గురించి తెలుసుకుందాం..

వీటివల్ల గలిగే మరిన్ని అద్భుతమైన లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం

  1. రోజు ఒక జామపండు తినడంవల్ల మనిషి శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి రక్షం శుభ్రపడుతుంది.
  2. ఇది డైజేషన్ సమస్యను తగ్గించడమే కాకుండా ఆకలిని వేసేలా చేసి మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
  3. అలాగే జామపండులో పీచు పదార్థాలు ఎక్కువ, పిండి పదార్ధాలు తక్కువగా ఉంటాయి. ఇది ఒకటి తింటే చాలు కడుపు నిండుగా అనిపిస్తుంది. జామపండు చెడు కొవ్వును తగ్గించడంతో పాటు బరువును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
  4. జామపండు యొక్క గొప్పతనం ఏంటంటే కొన్ని రకాల క్యాన్సర్లు మనదరికీ రాకుండా అవి మనల్ని కాపాడతాయి.
  5. జామ పండులో ఉండే లైకోపీన్, క్వెర్సెటిన్, విటమిన్ సి, ఇతర పాలీఫెనాల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
  6. అలాగే జామపండులో పీచు పదార్థాలు ఎక్కువ, పిండి పదార్ధాలు తక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయి.
  7. జామపండు శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. అంతేకాకుండా కాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో కూడా ఇది సాయపడుతుంది. జామ పండు ప్రోస్టేట్ కాన్సర్, రొమ్ము కాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
  8. రోజు ఒక జామ ఆకు తినడంవల్ల నోటి దుర్వాసన, పంటి నుంచి రక్షతం రావడం, వివిధరకాల పంటి సమస్యలను దూరం చేస్తుంది.
  9. జామపండు కంటిచూపుని మెరుగు పరచండం లో ఎంతగానో ఉపయోగపడుతుంది.
  10. మన చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. అనేక దంత సమస్యలను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
  11. క్రమం తప్పకుండ జామపండును తీసుకోవడంవల్ల సంతానసమస్యలతో బాధపడేవారికి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది.
  12. అంతేకాకుండా జామపండ్లు తిననివారితో పోలిస్తే డైలీ వీటిని తినేవారిలో మెమరీ పవర్ ( జ్ఞాపకశక్తి ) ఎక్కువగా ఉంటుంది.
  13. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్ననో ప్రయోజనాలను కేవలం ఒకేఒక్క జామపండును క్రమం తప్పకుండ తినడంవల్ల కలుగుతాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి నుంచి రోజు ఒక జామపండుని తిందాం మన ఆరోగ్యానికి మనమే డాక్టర్ అవుదాం.

పోషకాలు మెండుగా ఉండే మొక్కజొన్న

Advertisement

Next Story