ఆయన ఓ ట్రెండ్ సెట్టర్

by Sujitha Rachapalli |   ( Updated:2021-03-12 02:47:40.0  )
ఆయన ఓ ట్రెండ్ సెట్టర్
X

దిశ,వెబ్ డెస్క్ : ఆయన ఓట్రెండ్ సెట్టర్ ..డిజిటల్ రంగంలోనే ఆయన ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేలా తనలోని సృజనాత్మకతని వెలికితీసి అద్భతమైన చిత్రాలకు ప్రాణం పోస్తున్నాడు..ప్రాణంలేని వాటిని చూసి వీటికి ప్రాణం ఉందెమో అనేలా చేయడం ఆయన ప్రత్యేకత.. కొంచెం కొత్తగా ఆలోచిచేవారికి ఎక్కడైన ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అంటారుగా అలా తాను ప్రపచం అంతా తన పేరు మారు మోగి పోయేలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా..? అమెరికాలోని దక్షిణ కరోలినా, చార్లెస్టన్ కు చెందిన డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్ ఇతని అసలు పేరు మిక్ వింకెల్మన్ అందరిలా కాకుండా కొత్తగా ఆలోచిస్తాడు.

అయితే కెనడాకు చెందిన క్రిస్టీ వేలం సంస్థ బీపుల్ సృజనాత్మకతను ఆక‌ర్షించిందిఆ సంస్థలో సాధారణంగా ప్రముఖ చిత్రాలు, ప్రాచీన ,చాలా అరుదైన వస్తువులను వేలం వేస్తారు. అయితే మొట్ట మొదటి సారిగా బీపుల్ సృజనాత్మకత వలన ఓ డిజిటల్ ఇమేజ్ ను వేలం వేసింది.
అయితే ఈ ఇమేజ్ కోసం చాలా మంది పోటి పడ్డారు ఆఖరికి ఇది 501 కోట్ల రూపాయల 69 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. ఈ డిజిటల్ ఇమేజ్ ను బీపుల్ తాను రూపొందించిన అనేక ఇమేజ్ ల కలయికతో సృష్టిచడం మరో విశేషం.

ఈ విషయాన్ని తెలుపుతూ క్రిస్టీ ట్వీట్ చేసింది. ఆయన సృష్టించిన ఈ ఒరిజినల్ డిజిటల్ ఇమేజ్ ఎవరుపడితే వారు కాపీ చేసుకోలేరు. దాన్ని కొన్న వ్యక్తి మాత్రమే దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోగలడు. నాన్ ఫంజబుల్ టోకెన్ గా పిలిచే క్రిప్టో గ్రాఫిక్ టోకెన్ పద్ధతిలో ఈ చిత్రాన్ని రూపొందించాడని పెర్కొంది. అలానే ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న అత్యంత విలువైన మొదటి ముగ్గురు కళాకారుల్లో బీపుల్ ఒకరని క్రిస్టీ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed