అత్యధిక ఆదాయాన్ని సాధించిన బ్యాంకర్‌గా ఆదిత్య పూరి

by Harish |
అత్యధిక ఆదాయాన్ని సాధించిన బ్యాంకర్‌గా ఆదిత్య పూరి
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీగా గతేదాది పదవీ విరమణ చేసిన ఆదిత్య పూర్తి అత్యధికంగా వేతనాన్ని తీసుకున్న బ్యాంకర్‌గా నిలిచారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం రూ. 13.82 కోట్లను తీసుకున్నారు. 2020, అక్టోబర్‌లో బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన శశిధర్ జగదెషన్ అదే ఆర్థిక సంవత్సరంలో రూ. 4.77 కోట్ల జీతం తీసుకున్నారు.

ఇక, ఆదిత్య పూరి పదవీ విరమణ ప్రయోజనాల రూపంలో మొత్తం రూ. 3.5 కోట్లను కూడా అందుకున్నారు. ఇదే సమయంలో మరో దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ సందీప్ బక్షి 2020-21లో కరోనా మహమ్మారి కారణంగ ఆయన ఇతర పరిహారాలను స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఆయన మొత్తం రూ. 38.38 లక్షల వేతనాన్ని తీసుకున్నారు. అదేవిధంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి బోనస్‌గా రూ. 63.60 లక్షలు కూడా లభించాలని తెలుస్తోంది. మూడో దిగ్గజ ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ఎండీ సైతం గత ఆర్థిక సంవత్స్వరం రూ. 6.52 కోట్ల వేతనాన్ని అందుకున్నట్టు బ్యాంకు వార్షిక నివేదికలో పేర్కొంది. కరోనా పరిణామాల కారణంగా ఆయన సమీక్షించిన ఏడాదిలో వేతన పెంపును అందుకోలేదు.

Advertisement

Next Story