విజయవాడలో రూ. 30 లక్షల కలకలం

by srinivas |   ( Updated:2020-08-18 23:39:54.0  )
విజయవాడలో రూ. 30 లక్షల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో హవాలా కలకలం రేగింది. విజయవాడలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు విజయవాడకు, మరో ఇద్దరు కర్నూలుకు చెందిన వారిగా గుర్తించారు. నిందితులు ఆ నగదును బత్తాయి వ్యాపారానికి సంబంధించిన సొమ్ముగా అవాస్తవాలు చెప్పే యత్నం చేసినట్లు పోలీసులు చెప్పినట్లు సమాచారం.

Advertisement

Next Story