- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యారీపాటర్ ఫస్ట్ బుక్ అన్ని కోట్లు పలికిందా..?
దిశ, ఫీచర్స్: అతీంద్రియ శక్తుల నేపథ్యంతో పుస్తక రూపంలో వచ్చిన ‘హ్యారీ సిరీస్’.. పిల్లలు, పెద్దల్ని ఎంతగా అలరించిందో తెలిసిందే. అయితే, తన ఊహాశక్తితో ఇంతటి మ్యాజిక్ చేసిన రైటర్ జె.కె.రోలింగ్ స్టోరీని ముందుగా ఎన్నో పబ్లిషింగ్ హౌజ్‌లు రిజెక్ట్ చేశాయి. చివరగా యూకేకు చెందిన ఓ పబ్లిషింగ్ కంపెనీ 1275 యూరోలు చెల్లించింది. కానీ ఎక్కువ పుస్తకాలు అమ్ముడైతేనే రాయల్టీ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. అలా పబ్లిష్ అయిన మొదటి నవలే ‘హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ 2’. 26 జూన్ 1997న విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏజ్ గ్రూప్స్ ఆదరణ దక్కించుకున్న ఈ సిరీస్.. వాణిజ్యపరంగానూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ తర్వాత హ్యారీ ప్రభంజనం తెలిసిందే. ఫిబ్రవరి 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడై, చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన బుక్ సిరీస్‌గా నిలిచింది. కాగా యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించిన వేలంలో హ్యారీ పాటర్’ తొలి ఎడిషన్ $471,000కు అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించింది. ‘హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్’ స్టోన్ పుస్తకాన్ని బ్రిటిష్ పబ్లిషర్.. తొలిగా 500 కాపీలు మాత్రమే ముద్రించింది. ఆ కాపీల్లోని ఒక పుస్తకాన్ని అమెరికాకు చెందిన అక్షన్ హౌజ్ ‘హెరిటేజ్ అక్షన్స్’ గురువారం వేలం వేసింది. సదరు పుస్తకం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండగా.. గత ఫస్ట్ కాపీ ఎడిషన్స్ $110,000-$138,000 మధ్య అమ్ముడుపోయాయి.
కానీ ఈ పుస్తకానికి మాత్రం అనూహ్యంగా $471,000 ధర పలకడం విశేషం. దీంతో ఇప్పటివరకు విక్రయించబడిన వాటిలో హ్యారీ పాటర్ బుక్ అత్యంత ఖరీదైనదిగా రికార్డ్ సృష్టించింది. అయితే దీన్ని సొంతం చేసుకున్న కొనుగోలుదారు వివరాలను అక్షన్ హౌస్ విడుదల చేయకపోవడం గమనార్హం. హ్యారీ పాటర్ పుస్తకాలు 80 భాషల్లో అనువాదం కాగా, తన రచనలతో బిలియనీర్ అయిన మొదటి వ్యక్తిగా జేకే రౌలింగ్ చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం బ్రిటన్‌లోని అత్యంత సంపన్నుల్లో రౌలింగ్ కూడా ఒకరు. టైమ్స్ మ్యాగజైన్ 2016 లో విడుదల చేసిన ‘టైమ్స్ 100’ జాబితాలో ఆమె కూడా చోటు సంపాదించుకుంది.