- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షట్‌డౌన్ దిశగా ‘హార్లీ డేవిడ్ సన్’ ప్లాంట్?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ వలన దేశంలో చాలా మేర కంపెనీలు తమ అస్థిత్వాన్ని కోల్పోయాయి. మళ్లీ అవి మునుపటి స్థాయికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుందని.. అందుకు ప్రభుత్వాల ప్రోత్సాహకాలు అందించాలని పారిశ్రామిక, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా అత్యంత లగ్జరీ వాహన తయారీ దారులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్ భారత్‌లో తన కార్యకలాపాలను మూసివేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అమ్మకాలు గణనీయంగా పడిపోవడమే అందుకు కారణం. ప్రస్తుతం బైకుల అమ్మకాలు పేలవంగా ఉండటం, భవిష్యత్‌లోనూ లగ్జరీ బైక్‌లకు డిమాండ్ పెద్దగా ఉండదని భావించిన అమెరికా కంపెనీ అసెంబ్లింగ్ ఆపరేషన్లను మూసివేయాలని యోచిస్తోంది. హరియాణాలోని బావాల్ వద్ద లీజుకు తీసుకున్న అసెంబ్లింగ్ సదుపాయాన్ని ఔట్‌సోర్సింగ్ ఒప్పందం కోరుతూ కొన్ని వాహన తయారీదారులను సంప్రదించినట్లు విశ్వసనీయ సమాచారం.
గత ఆర్థిక సంవత్సరంలో హార్లే డేవిడ్‌సన్ ఇండియా 2,500 కన్నా తక్కువ బైకులు అమ్మింది. కాగా, ఇప్పటికే రోడ్లపై ఉన్న బైక్‌లకు సర్వీస్ సేవలను అందించడానికి తాత్కాలిక ఆపరేషన్స్ కొనసాగించడానికి కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.