ఒక్కరి జల్సా పది మంది ప్రాణాలకు ముప్పు

by Shyam |
ఒక్కరి జల్సా పది మంది ప్రాణాలకు ముప్పు
X

ఒక్కరి ఎమర్జెన్సీ పది మంది ప్రాణాలకు ముప్పు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. పోలీసులు వాళ్ల ప్రాణాలు లెక్క చేయకుండా మనకోసం జనతా కర్ఫ్యూ విధుల్లో పాల్గొన్నప్పుడు … కేవలం మన రక్షణ కోసం మనం ఇంట్లో ఉండకపోవడం శోచనీయం అన్నారు. కరోనా ప్రభావాన్ని అంత నిర్లక్ష్యం చేయకుండా ఇంటి పట్టునే ఉండాలని కోరుతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 19 వరకు … అంటే 48 రోజుల్లో ఇండియాలో 181 పాజిటివ్ కేసులు నమోదు ఐతే… కేవలం ఈ రెండు రోజుల్లో 131 కేసులు నమోదయ్యాయి అని… సామాజిక దూరం( social distancing) ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని కోరారు. విదేశాల నుంచి భారత్ వచ్చిన వారు సెల్ఫ్ క్వారెంటెన్ పాటించాలని కోరారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు గొప్పగా ఉన్నాయని…. మనం చేసేదల్లా కేవలం ఇంట్లో కాలు మీద కాలేసుకుని ఉండడమే అని… అది కూడా చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు.

Tags: Harish Shankar, Social Distancing, Coronavirus, Covid 19

Advertisement

Next Story