24 గంటలు పనిచేస్తున్నాం: హరీశ్ రావు

by Shyam |   ( Updated:2020-04-06 05:16:32.0  )
24 గంటలు పనిచేస్తున్నాం: హరీశ్ రావు
X

దిశ, మెదక్: రైతుల సంక్షేమం, కరోనా నిర్మూలన కోసం 24 గంటలు పనిచేస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగం పట్ల ఎంతో శ్రద్ధతో పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగుల కొరత ఉన్న విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లినట్టు తెలిపారు. శనగలను క్వింటాలుకు రూ. 4,875 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని తెలిపారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 7,770 వరి కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పువ్వు పంటల కొనుగోలు కేంద్రాలనూ ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 30 వేలకోట్లను కేటాయించిందని అన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర అటవీశాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

tags:harish rao, finance minister, siddipet, gajwel, corona, kcr, modi, peanuts buy centre, crop but centre, mp kotha prabhakar reddy

Advertisement

Next Story

Most Viewed