- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన సెలవు తీసుకున్నా సగం వేతనం ఇవ్వండి.. వివాదస్పదంగా సర్కార్ ఆర్డర్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. ప్రభుత్వం కూడా వారికి వత్తాసు పలుకుతోంది. ట్రాన్ష్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు సెలవులో ఉన్నా సరే హాఫ్ పే చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయడంపై విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్ల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది. ఉద్యోగులకు ఒక రూల్.. సీఎండీలకు ఒక రూల్ ఉంటే ఎలా అని వారు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సర్కార్ సర్క్యులర్ జారీ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ గత కొద్ది రోజులుగా సెలవుల్లో ఉన్నారు. ఈనెల 1 నుంచి 18వ తేదీ వరకు లీవ్ పెట్టుకున్నారు. అయితే తాజాగా ఆ సెలవులను 19 నుంచి 30వ తేదీ వరకు పొడిగించారు. సెలవులు పొడగింపుతో పాటు అప్పటి వరకు లీవ్‌లో ఉన్న రోజులకు సైతం సగం వేతనం చెల్లించేలా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
సాధారణంగా ప్రభుత్వ సంస్థకు చెందిన ఏ ఉద్యోగికి అయినా హాఫ్ పే లీవ్ అనేది వర్తించదు. ఉద్యోగి లీవ్ పెడితే లాస్ ఆఫ్ పేగానే నిర్ణయిస్తారు. వచ్చిన రోజును మాత్రమే కౌంట్ చేసి రాని రోజు వేతనంలో కోత విధిస్తారు. కానీ అందుకు విభిన్నంగా ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీకి హాఫ్ పే లీవ్ అందించడం నిబంధనలకు వ్యతిరేకమని విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగులు, కార్మికులు చెబుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగులకు వచ్చేదే అరకొర జీతాలు. అత్యవసరమున్నా వారికి అధికారులు సెలవులు ఇవ్వరు. లీవ్ పెడితే వచ్చే వేతనాల్లో కోత తప్పదు. కానీ ఇక్కడ సీఎండీ స్థాయి అధికారికి జీతం లక్షల్లోనే వచ్చినా సెలవుల్లో ఉన్నా సగం వేతనం చెల్లించాలని ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగులకో రూల్.. సీఎండీలకో రూలా అని వారు మండిపడుతున్నారు.