మూడు రోజులపాటు వడగాల్పులు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు !

by Seetharam |   ( Updated:2023-06-02 06:02:51.0  )
మూడు రోజులపాటు వడగాల్పులు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు !
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగా ఉంటేనే మంచిది. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావారణ శాఖ హెచ్చరించింది. 302 మండలాల్లో ఈ ప్రభావం ఉందని తెలిపింది. కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వాతవరణశాఖ. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో రెండురోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

రాయలసీమ జిల్లాలో కురిసిన అకాల వర్షం, పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ఏపీలోని రాయలసీమ జిల్లాలో పలు చోట్ల వాన బీభత్సం సృష్టించింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం విరుపాపురంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

తిరుపతిలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కురిసిన వర్షంతో ఒక్కసారిగా శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం ముందు భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు కింద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. తాత్కాలికంగా స్వామి వారి దర్శనం నిలిపివేశారు అధికారులు.

Advertisement

Next Story

Most Viewed