- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నా భర్త ఏమయ్యాడు.. నాకు చూపించండి

దిశ, హైదరాబాద్: కరోనా పాజిటివ్‌తో గాంధీలో చికిత్స పొందుతూ.. మృతి చెందాడన్న మధుసూదన్ వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. గాంధీ ఆస్పత్రి సిబ్బంది చనిపోయాడని ధృవీకరించినప్పటికీ.. బాధితుడి భార్య వాటిని కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన భర్త ఆచూకీ తెలపాలని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అసలు తన భర్త బతికి ఉన్నాడో లేదో అని స్పష్టం చేయాలంటూ అల్లంపల్లి మాధవి ఆ పిటిషన్‌లో అనుమానం వ్యక్తం చేశారు. బతికే ఉన్నా వివరాలు చెప్పడం లేదని ఆరోపించారు. చనిపోతే మరణ ధృవీకరణ పత్రం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. అంతేకాకుండా, తన భర్తను హాజరు పరిచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన ఉన్నత న్యాయస్థానం మధుసూదన్ మరణించాడో.. బతికే ఉన్నాడో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ మృతి చెందిన ఆ విషయం బాధితుడి భార్యకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో సమాధానం చెప్పాలని ఆదేశిస్తూనే.. విచారణను రేపటికి వాయిదా వేసింది.