ఆ అసెంబ్లీలో… కొశ్చన్ అవర్‌ రద్దు

by Shamantha N |
ఆ అసెంబ్లీలో… కొశ్చన్ అవర్‌ రద్దు
X

గాంధీనగర్: ఈ నెల 21 నుంచి ఐదు రోజులపాటు గుజరాత్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొశ్చన్ అవర్‌ను ఉండబోదని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా మాట్లాడుతూ, ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడానికి రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గూండా నియంత్రణ చట్టం, పాసా యాక్ట్, భూకబ్జా వ్యతిరేక చట్టం, రెవెన్యూ సంస్కరణలు సహా 24 కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు.

ఈ సమావేశాల్లో కొశ్చన్ అవర్‌ను రద్దు చేసినట్టు వివరించారు. సీనియర్ అధికారులు చాలా మంది కరోనా కట్టడి చర్యలను సమన్వయం చేయడానికి పలు జిల్లాల్లో ఉన్నారని, అందుకే కొశ్చన్ అవర్‌ను రద్దు చేయాలని స్పీకర్‌ను సీఎం విజయ్ రూపానీ అభ్యర్థించగా, అందుకు స్పీకర్ అంగీకరించారని తెలిపారు. త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశాల్లోనూ కొశ్చన్ అవర్‌ను రద్దు చేయడంపై విపక్షాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed