భర్తను వదిలి ముగ్గురితో భార్య రాసలీలలు.. సపోర్ట్ చేసిన తల్లి.. ఆపై

by Sumithra |   ( Updated:2021-09-15 01:48:36.0  )
భర్తను వదిలి ముగ్గురితో భార్య రాసలీలలు.. సపోర్ట్ చేసిన తల్లి.. ఆపై
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో సొంతవారిని హతమారుస్తున్నారు కొంతమంది.. తాము ప్రేమించినవారు అలాంటి పనులు చేస్తున్నారని తట్టుకోలేక ప్రాణాలను విడుస్తున్నారు మరికొంతమంది. తాజాగా ఒక వ్యక్తి, భార్య వివాహేతర సంబంధాలు, అత్తగారి వేధింపు తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. గురుగావ్ కి చెందిన అఖిలేష్ కుమార్(43) అనే వ్యక్తి లోటస్ వ్యాలీ స్కూల్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య సంతోషి భాయ్, అత్త చందా భాయ్ తో నివాసముంటున్న అతనికి కొన్నిరోజుల క్రితం భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పురుషులతో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలిసి అతను కోపంతో భార్యను నిందించాడు. ఇలాంటివి మానుకోవాలని హెచ్చరించాడు. అయితే, ఆమె భర్త మాటను పట్టించుకోలేదు.. అంతేకాకుండా ఈ విషయమై అతని అత్త చందా భాయ్, అఖిలేష్ ని బెదిరించింది. తన కుమార్తెను వారివద్దకు పంపించకపోతే చంపేస్తానని బెదిరించడంతో కుంగిపోయిన అతను సోమవారం తాను పనిచేస్తోన్న లోటస్ వ్యాలీ స్కూల్ స్టార్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ లో ” తన చావుకు, స్కూల్ కి ఎటువంటి సంబంధం లేదని, తన భార్య వివాహేతర సంబంధాలు, తన అత్త బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటున్నట్లు” తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య, అత్తని విచారిస్తున్నారు.

తెలంగాణలో పెరిగిన నేరాలు.. 175 వరకట్న చావులు!

Advertisement

Next Story