- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సెకెండ్ వేవ్' ప్రభావంతో జీఎస్టీ వసూళ్లు తగ్గే అవకాశం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా కీలక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు ఏర్పడటంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు 10-20 శాతం తగ్గే అవకాశమున్నట్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘దేశవ్యాప్తంగా కరోనా నియంత్రించడానికి తీసుకున్న చర్యల వల్ల కార్యకలాపాల నిర్వహణ, సరఫరా అడ్డంకులు వంటి వాటివల్ల జీఎస్టీ వసూళ్లు తగ్గడానికి కారణమవ్వొచ్చని కేపీఎంజీ ఇండియాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ చెప్పారు. ప్రస్తుత పాక్షిక లాక్‌డౌన్ కారణంగా ఆటో, సిమెంట్, ఇంకా ఇతర ఉత్పత్తి రంగాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ రంగాల్లోని అమ్మకాలపై అదనపు ఒత్తిడి కలిగిస్తుందని’ డెలాయిట్ ఇండియా తెలిపింది. గతేడాది లాక్‌డౌన్ వల్ల వినియోగం, దుకాణదారుల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని, ప్రస్తుత లాక్‌డౌన్ ప్రత్యేకమైనది. ఈ పరిస్థితులు తక్కువకాలమే ఉండవచ్చని, పరిణామాలు అంత తీవ్రంగా ఉండే అవకాశం లేదని, ప్రభావ తీవ్రత గతేడాది కంటే తక్కువగా ఉండొచ్చని వర్త్ వాటర్‌హౌస్ కో పేర్కొంది.