వైరల్ పిక్.. చెడ్డీలో వరుడు.. సిగ్గుపడ్డ వధువు

by Sujitha Rachapalli |   ( Updated:2021-04-08 03:45:31.0  )
వైరల్ పిక్.. చెడ్డీలో వరుడు.. సిగ్గుపడ్డ వధువు
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే అపురూప వేడుక ‘పెళ్లి’ కాగా, ఆ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుంచుకునేలా ఫొటోలు, వీడియోలు తీసుకోవడం కామన్. ఈ సందర్భంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు వధూవరులు తమ కాస్టూమ్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. విభిన్న సంప్రదాయ వస్త్రాలు ధరిస్తూ అందంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. స్పెషల్ అట్రాక్షన్‌గా తామే నిలవాలని గాగుల్స్, వాచ్ ధరించి ఆధునికతను మేళవిస్తుంటారు. అయితే ఇక్కడొక పెళ్లికి వరుడు చెడ్డీ మీద రావడం విశేషం. అయినా వధువు అతడిని పెళ్లి చేసుకుంది. ఈ వివాహ తంతు ఎక్కడ జరిగిందంటే..

ఇండోనేషియాకు చెందిన వరుడు సుప్రప్తో పెళ్లికి నాలుగు రోజుల ముందు బైక్‌పై బయటకు వెళ్లాడు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రీట్‌మెంట్‌లో భాగంగా వైద్యులు అతడి శరీరంలోని పలు పార్ట్స్‌కు బ్యాండేజ్ వేయడంతో పాటు చేతికి కట్టు కట్టారు. అంతేకాదు సర్జరీ కూడా జరగడం వల్ల బట్టలు ధరించడానికి అతడి బాడీ సహకరించదని పేర్కొన్నారు. దీంతో చేసేదేంలేక ఆ వరుడు చెడ్డీపైనే పెళ్లికి హాజరయ్యాడు. ఇండోనేషియా, తూర్పు జావా ప్రావిన్స్‌లోని ఎంగంజుక్‌లో వధువు ఇంటివద్ద ఈ వివాహం జరిగింది. పెళ్లితో పాటు ఆ తర్వాత కార్యక్రమాల్లోనూ వరుడు సంప్రదాయ వస్త్రాల్లో కాకుండా షార్ట్ పైనే కనిపించాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అవి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెటిజన్లు వధూవరులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ‘ఇకపై నువ్వు ఒంటరిగా బయటకు వెళ్లలేవని, భార్య తోడుగా ఉంటుందని, ద షో మస్ట్ గో ఆన్’ అని పలువురు వ్యంగంగా కామెంట్లు చేస్తున్నారు.

నా భర్త పెళ్లికి నాలుగురోజుల ముందు బైక్‌పై వెళ్తుండగా స్పృహ కోల్పోయి ఎదురుగా వచ్చే వెహికల్‌ను ఢీకొట్టాడు. డాక్టర్ల ట్రీట్‌మెంట్‌తో కోలుకున్నాడు. సంప్రదాయ వస్త్రాల్లో కాకుండా షార్ట్ పైనే తనను పెళ్లి చేసుకోవడం నాకు ఆనందంగానే ఉంది.
– వధువు ఎలిందా డ్వి క్రిస్టియాని

Advertisement

Next Story