- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి సమాధానం
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి , బాల్క సుమన్, రేఖా శ్యాంనాయక్ హరిత హారం కార్యక్రమంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. తెలంగాణలో పచ్చదనం శాతం 3.67% పెరిగినట్లు ‘సర్వే ఆఫ్ ఇండియా’ ప్రకటించడం హరిత హార కార్యక్రమం ద్వారా సాధించిన విజయమేనన్నారు.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి హైదరాబాద్ ను ట్రీ సిటీ ఆఫ్ ఇండియాగా గుర్తించిందన్నారు. ఇప్పటి వరకు హరిత హారం కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకుంటే 217.406 కోట్ల మొక్కలు నాటామన్నారు. నాటిన మొక్కల సంరక్షణ, వాటిని బ్రతికించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించామని, నాటిన మొక్కల్లో 85% మొక్కలను బ్రతికించుకోవాలనే ఉద్దేశ్యంతో మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాల్లో సవరణ చేయడం జరిగిందన్నారు.
గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలీటీల్లో మొక్కలు నాటి సంరక్షించేందుకు వార్షిక బడ్జెట్ లో 10% హరిత బడ్జెట్ గా ప్రత్యేకంగా కేటాయిస్తున్నామన్నారు. అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ… తెలంగాణలో మొత్తం భౌగోళిక విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలు కాగా, ఇందులో 66.66 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూమి ఉందని మొత్తం తెలంగాణాలో 24.05 శాతం అడవులు ఉన్నాయని తెలిపారు. భారతదేశంలో ఉన్న 21.34 శాతం అడవితో పోలిస్తే… తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని, భౌగోళిక విస్తీర్ణంలో కనీసం 33 శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహార కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.