కరోనా పేషెంట్ల కోసం ఆస్పత్రి డొనేట్ చేసిన ప్రభాస్ టీమ్

by vinod kumar |
Radhe Shyam Team, Hospital Set
X

దిశ, సినిమా: కరోనా కారణంగా నెలకొన్న క్లిష్టపరిస్థితుల్లో ‘రాధే శ్యామ్’ టీమ్ గొప్ప చొరవ తీసుకుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకులు కాగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. బెడ్లు లేక, ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు చనిపోతున్నారని న్యూస్ వస్తున్న నేపథ్యంలో ‘రాధే శ్యామ్’ టీమ్ స్పెషల్‌గా ఏర్పాటు చేసిన ఆస్పత్రి సెట్‌ను డొనేట్ చేసింది. 50 బెడ్స్, స్ట్రెచర్స్, పీపీఈ కిట్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్, ఆక్సిజన్ సిలిండర్లను ఓ ఆస్పత్రికి అందించింది. దీంతో సోషల్ మీడియాలో టీమ్‌ను అభినందిస్తున్నారు నెటిజన్లు. మిగతా మూవీ యూనిట్లు కూడా ఇలాంటి ఇనిషియేషన్ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed