- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలపై చర్యలకు కేంద్రం ఆదేశం!
దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై వ్యాపారుల సంఘం కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఆరోపణలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు ఎఫ్‌డీఐ పాలసీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్-1999 చట్టాన్ని ఉల్లంఘించాయని సీఏఐటీ పలుమార్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌డీఐ పాలసీ, ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ చట్టాలను ఉల్లంఘించినట్టు వివరిస్తూ సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖందేల్వాల్ ఈడీ, ఆర్‌బీఐలకు రాసిన లేఖలో తెలిపారు.
ఇరు కంపెనీలపై అందిన ఫిర్యాదులు
* ఫ్లిప్‌కార్ట్, ఆదిత్య బిర్లా గ్రూప్ మధ్య జరిగిన ఒప్పందంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విధానం ఉల్లంఘన.
* తయారీకి సంబంధించి ఎఫ్‌డీఐ విధానం ఉల్లంఘన. ఈ-కామర్స్ సంస్థలకు, వివిధ కంపెనీలకు మధ్య పలు బ్రాండ్ రిటైలింగ్ పేరున ఎఫ్‌డీఐ పాలసీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ చట్టాల ఉల్లంఘన.
* అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ చట్టం, ఎఫ్‌డీఐ పాలసీలో ఉన్న లొసుగులను ఉపయోగించి చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపణ.