- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్యాబ్లెట్ రూపంలో కాఫీపొడి.. సర్కారీ కాలేజీ అమ్మాయిల ఘనత
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఉప్మా చేసుకోవాలంటే.. పచ్చిమిర్చి కొత్తిమీర, కరివేపా, పోపు గింజలు, టమాట, ఉప్పు, అల్లం అన్ని అవసరమయ్యేవి. కానీ ఇన్‌స్టాంట్ ఉప్మా ప్యాక్‌లు వచ్చాక జస్ట్ నీళ్లు పోసి కలుపుకుంటే చాలు మూడు నాలుగు నిమిషాల్లో ఉప్మా తయారవుతోంది. పులిహోర, టమాట రైస్, దోశ, ఇడ్లీ, చపాతీ, పరోటా వంటి ఎన్నో పదార్థాలు రెండు నిమిషాల్లో చేసుకునేలా నూడుల్స్ ఇన్‌స్టంట్‌గా దొరికేస్తున్నాయి. వీటితో పాటు కాఫీ పొడి కూడా సాచెట్స్ లేదా బాటిల్స్‌లో దొరుకుతుంది. కానీ అవి ట్రావెల్ ఫ్రెండ్లీ కాదు. ఇక సాచెట్స్ వల్ల ప్లాస్టిక్ వినియోగం, చెత్త పెరుగుతోంది. దాంతో దీనికి పరిష్కారంగా, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ కళాశాలకు చెందిన నలుగురు అమ్మాయిలు కాఫీ ట్యాబ్లెట్స్ రూపొందించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
‘ఫిల్టర్ కాఫీ’కి ప్రపంచవ్యాప్తంగా బోలెడంతమంది అభిమానులున్నారు. ఎర్నాకుళం జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు సౌందర్య, ఎలిషా, దింపాల్, శివానందనలకు కాఫీ అంటే చాలా ఇష్టం. అయితే యూఎస్‌లో జరిగే టై గ్లోబల్‌లో తాము కూడా పార్టిసిపేట్ చేయాలని నిర్ణయించుకున్న ఈ బృందం తమ సొంత వ్యాపార ఆలోచనతో వెళ్లాలని నిర్ణయించున్నారు. అందుకోసం తమకు ప్రియమైన ‘కాఫీ’తోనే ప్రయోగం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎక్కడైనా కాఫీపొడి కోసం సాచెట్స్, సీసాలు మాత్రమే ఉపయోగిస్తున్నారని వారు గ్రహించారు. దీనికి ప్రత్నామ్నాయంగా పాకెట్ ఫ్రెండ్లీ ‘కాఫీ పిల్’ తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇది ఫిల్టర్ కాఫీని క్యాప్సూల్‌లో ప్యాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. తమ ప్రాజెక్ట్‌ను టై గ్లోబల్‌కు సమర్పించడంతో నిర్వాహకుల ప్రశంసలతో పాటు ప్రపంచ గుర్తింపు దక్కింది.
‘మేము చాలా పరిశోధనల చేసిన తర్వాత ఈ ఆలోచనకు వచ్చాం. కాఫీ పొడి పరిమాణాన్ని క్యాప్సుల్‌గా కుదించాం. ఇది సేంద్రీయ పద్ధతి కావడంతో పాటు పాకెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్. ఎప్పుడైనా, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే, వ్యర్థాలను ఉత్పత్తి చేసే సమస్య తలెత్తదు. ఫిల్టర్ కాఫీని కాసావా కవరింగ్‌తో క్యాప్సూల్‌గా కుదించాం. ఈ ప్యాకింగ్ కాఫీని తేమనుంచి కాపాడుతుంది. దీనికి మూడు నెలల షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఇది మంచి వ్యాపార ఆలోచన కాగా లోగోను జోడించి ట్రేడ్‌మార్క్ లైసెన్సింగ్ కోసం సమర్పించాం. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత మేము మా వ్యాపార ఆలోచనను పూర్తి స్థాయి వెంచర్‌గా మారుస్తాం’ అని విద్యార్థుల బృందం తెలిపింది.