ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్తున్న టెస్టులు బంద్.. రాసిన డాక్టర్లపై సీరియస్ ​యాక్షన్​

by Sridhar Babu |   ( Updated:2021-12-14 11:54:06.0  )
labs-1
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నమెంట్​నుంచి ప్రైవేట్​ఆసుపత్రులు, ల్యాబ్​లకు వెళ్తున్న టెస్టులు బంద్​కానున్నాయి. ఇక నుంచి బయటకు రాసిన డాక్టర్లపై సర్కార్​సీరియస్​యాక్షన్ తీసుకోనుంది. అంతేగాక దొడ్డిదారిన ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్న డాక్టర్లు, వ్యక్తులపై నిఘా పెట్టనుంది. ఈ దోపిడీని అరికట్టేందుకు ప్రతీ ఆసుపత్రిలో ఓ టీమ్​ను కూడా ఏర్పాటు చేయనున్నారు. వీరు నిత్యం ఓపీ కేంద్రాలు, వార్డులు, మెడికల్​స్టోరేజ్​సెంటర్లు, గోడౌన్​లలో తనిఖీలు చేస్తుంటారు. అన్ని టెస్టులు సర్కార్ లోనే జరిగేలా యాక్షన్ ఫ్లాన్​ను సిద్ధం చేస్తున్నారు. ఖరీదైన టెస్టులను మాత్రం నిమ్స్​లో చేసేలా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్, చెస్ట్, నిమ్స్‌ ఆస్పత్రుల టెస్టుల సమన్వయ ఒప్పందాలు జరగనున్నాయి.

మరోవైపు సర్కార్​దవాఖాన్లలో వినియోగించే రీయోజెంట్స్ కొరత కారణంగా కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసే పరీక్షలు కూడా ఇప్పటి వరకు బయటకు రాస్తూ వచ్చారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్​పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. రీయోజెంట్స్, మందులు కలిపి సుమారు రూ. 600 కోట్ల వరకు పెట్టేందుకు సర్కార్​సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు గాంధీ ఆసుపత్రిలో లివర్ ట్రాన్సప్లాంటేషన్ కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్​రావు అధికారులకు ఆదేశాలిచ్చారు. అవసరమైతే ఉస్మానియా నుంచి వైద్యులను తీసుకోవాలని సూచించారు. అంతేగాక ప్రైవేట్ మెడికల్ షాపులకు వెళ్తున్న పేషెంట్లపై కూడా దృష్టిసారించనున్నారు. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేదానిపై స్పష్టత తీసుకొని ఒకవేళ స్వయంగా డాక్టర్​రిఫర్​చేస్తే చర్యలు తీసుకోనున్నారు.

నో క్లారిటీ..?

గాంధీ, ఉస్మానియా, ఫీవర్, నిలోఫర్​ఆసుపత్రుల్లో అందుబాటులో లేని టెస్టులను నిమ్స్​కు పంపించాలని ప్రభుత్వం సూత్రపాయ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అవి ఉచితంగా చేస్తారా? నిమ్స్​నిబంధనల ప్రకారం ఛార్జీలు చెల్లించాలా? అనేదానిపై సర్కార్​క్లారిటీ ఇవ్వలేదు. అంతేగాక దూర ప్రాంతాలకు వెళ్లలేని పేషెంట్లను ఆసుపత్రి అంబులెన్స్ లలో పంపిస్తారా? సొంతంగా వెళ్లలా అనేది కూడా చెప్పలేదు. ఒక వేళ నిమ్స్​లో చేసే టెస్టులకు పేషెంట్లే డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే, వాటితోపాటు ఛార్జీల ఖర్చు కూడా రోగులపై పడనుంది. ఈక్రమంలో పేద రోగులకు ఆర్ధిక భారం బాధ తప్పేవిధంగా ప్రభుత్వం నిర్ణయం ఉండాలని పలువురు డాక్టర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed