టీఆర్ఎస్ అంటే నమ్మకం.. బీజేపీ అంటే అమ్మకం- బాల్క సుమన్

by Shyam |   ( Updated:2021-09-28 03:40:38.0  )
టీఆర్ఎస్ అంటే నమ్మకం.. బీజేపీ అంటే అమ్మకం- బాల్క సుమన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ అంటే ఓ నమ్మకం అని.. బీజేపీ అంటే అమ్మకం అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లకు ఈటల.. గొడుగులు, గోడ గడియారాలు, గొర్రెలు, మేకలు, కుంకుమ భరణిలు ఇస్తూ మభ్యపెడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ఆయన ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ కే పట్టం కడతారని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ పనితీరు పైనే మేము ఓటు అడుగుతున్నామని స్పష్టం చేశారు. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు కావడంతోనే అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పథకాలు ఎన్నికల కోసం రావని ప్రజల సంక్షేమం కోసమే వస్తాయని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను, గ్యాస్ డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్ముతూ.. ప్రభుత్వ సంపదను ప్రైవేట్ పరం చేస్తే లక్షలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధాల బీజేపీకి.. అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ కి మధ్య జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయమని పేర్కొన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed