ఉద్దీపన ప్రకటించాల్సి ఉంటుంది: సుబ్రమణియన్

by Harish |
ఉద్దీపన ప్రకటించాల్సి ఉంటుంది: సుబ్రమణియన్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం మరిన్ని చర్యల తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహదారు కె వి సుబ్రమణియన్ అన్నారు. సెకెండ్ వేవ్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందని పలు పరిశ్రమ సంస్థల నుంచి వస్తున్న అభ్యర్థనలపై ఆయన స్పందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని తాజా ఉద్దీపన ప్యాకేజీ ఉండనున్నట్టు సుబ్రవమణియన్ తెలిపారు.

ఆర్‌బీఐ అంచనాల ప్రకారం.. సెకెండ్ వేవ్ కారణంగా దేశానికి రూ. 2 లక్షల కోట్ల నష్టం ఏర్పడింది. ‘గతేడాది మాదిరిగానే ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు మరిన్ని చర్యలను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము. గతేడాదికి, ఇప్పటికీ మధ్య ఉన్న బేధాలను పరిగణలోకి తీసుకుని ఉద్దీపన ప్రకటించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. నిర్మాణ కార్యకలాపాలు, అసంఘటిత రంగంలో ఉద్యోగాలను సృష్టించడం, డిమాండ్‌ను పెంచేందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల వ్యయంపై దృష్టి సారిస్తున్నామన్నారు. తాజా ఉద్దీపన ప్యాకేజీ ఆర్థిక పునరుద్ధరణ వేగవంతం చేసే లక్ష్యంతో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సెకెండ్ వేవ్ ప్రభావం కారణంగా ఈ ఏడాది జీడీపీ వృద్ధి ప్రతికూల ప్రభావం ఉంటుందని సుబ్రవమణీయన్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఎకనమిక్స్ సర్వేలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 11 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed