- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెఫ్టీ లేదు, శ్రద్ధా లేదు..? అగ్గి రాజుకుంటే బుగ్గే!
దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ శాఖపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలే స్ఫష్టం చేస్తున్నాయి. వేసవి వచ్చిందంటేనే భగ భగ మండే భానుడి ప్రతాపంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు, నివాస సముదాయాలలో ఆకస్మాత్తుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే, సకాలంలో ప్రమాదాన్ని నివారించేందుకు ఫైరింజన్ ఫ్రీగా తిరగడానికి సరిపడ స్థలం, వెసులుబాటు లేకపోవడంతో ఈ ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఇష్టారీతిగా భవన నిర్మాణాలు..
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు ఇతర నిర్మాణ భవనాలలోనూ ఫైర్ నిబంధనలను పాటించకపోవడం కారణంగానే అగ్నిప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే, బస్తీలు, కాలనీలలో స్థానిక రహదారులు ఇరుకుగా ఉండటం వల్ల అగ్నిమాపక వాహనం వెళ్లేందుకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో చాలా వరకూ ప్రమాదాలను నివారించడంలో అధికారులు చేతులెత్తేయ్యాల్సిన పరిస్థితులు నెలకుంటున్నాయి. భవన నిర్మాణాల విషయంలో 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తుగల జీ ప్లస్ 5 అపార్టుమెంట్లు, జీ ప్లస్ 4 కమర్షియల్ భవనాలకు జీహెచ్ఎంసీ ఫైర్ ఎన్ఓసీ జారీ చేస్తుండగా.. ఆ పై ఎత్తు గల భవనాలకు భవనాలకు మాత్రమే ఫైర్ సర్వీసెస్ శాఖ ఫైర్ ఎన్ఓసీ ఇవ్వాల్సి వస్తోంది. ఈ ప్రకారం ఫైర్ ఎన్ఓసీ అనుమతులు దాదాపుగా జీహెచ్ఎంసీ అధికారులే మంజూరు చేస్తుండగా ఫైర్ సర్వీసెస్ వద్దకు వచ్చే అనుమతులు చాలా తక్కువ ఉంటున్నాయి. చాలా వరకూ ఫైర్ అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టిన సందర్భాలు కూడా అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఫైర్ ఎన్ఓసీ వ్యవహారంలో సరైన పర్యవేక్షణ కొరవడుతోందనే విమర్శలు ఉన్నాయి.
అవగాహన లోపంతో నిర్లక్ష్యంగా..
రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో (2016-20) 45,231 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్టుగా ఫైర్ సర్వీసెస్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. చిన్నపాటి ప్రమాదాలు 41,099, ఒక మాదిరి ప్రమాదాలు 1734 కాగా, తీవ్ర స్థాయిలో 542 ప్రమాదాలు జరిగాయి. అత్యవసరంగా రెస్క్యూ చేసినవి ఘటనలు 1856 ఉన్నాయి. ఈ ప్రమాదాల లో 6645 ఇళ్లల్లో, స్టోరేజ్, వేర్ హౌజెస్ గూడ్స్ యార్డ్స్, షెడ్లు లలో 1044, దుకాణాలు, కార్యాలయాలలో 2749 ప్రమాదాలు జరిగాయి. వీటిలో నిర్లక్ష్యంగా స్మోకింగ్ చేయడం కారణంగా 22,697 ప్రమాదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటు చేసుకున్న ప్రమాదాలు 13,380 ఉండటం గమనార్హం. మొత్తం 45 వేల ప్రమాదాలలో దాదాపుగా 36 వేల ప్రమాదాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్, నిర్లక్ష్యంగా స్మోకింగ్ చేయడం కారణంగానే చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
సిబ్బంది కొరత..
అగ్ని ప్రమాదాల నివారణకు అత్యంత కీలకంగా పనిచేసే డిజిస్టార్ మేనేజ్మెంట్, ఫైర్ సర్వీసెస్ శాఖలో కావాల్సిన అన్ని సదుపాయాలు లేకపోవడమే కాకుండా, సిబ్బంది నియామకంలోనూ తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నంది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 20 కి.మీటర్లకు, పట్టణ ప్రాంతాలలో ప్రతి 10 కి.మీటర్లకు ఒక అగ్నిమాపక కేంద్రం (యూనిట్) అందుబాటులో ఉండాల్సి ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా 119 ఫైర్ స్టేషన్లు, 15 ఔట్ పోస్టులలో 260 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మొత్తం 2256 పోస్టులు మంజూరు కాగా, ఇంకా 842 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫైర్‌మెన్, డ్రైవింగ్ ఆపరేటర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ లాంటి అతి ముఖ్యమైన పోస్టులు సైతం ఖాళీగా ఉండటంతో ఫైర్ విభాగానికి సిబ్బంది కొరత తీవ్రంగా ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ప్రస్తుతం 130 మంది ఫైర్ మెన్ లు శిక్షణలో ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నా.. మరో 712 పోస్టులు ఖాళీలు ఉంటున్నాయి.
మంజూరైన పోస్టులు – 2256
మొత్తం ఖాళీలు – 842
ఫైర్ మెన్ పోస్టులు మంజూరైనవి – 1316, ఖాళీలు – 541
డ్రైవర్ ఆపరేటర్ మంజూరైనవి – 392, ఖాళీలు – 212
స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ పోస్టులు మంజూరైనవి – 133, ఖాళీలు – 49