- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖరీఫ్ కోతలు షురూ.. ధాన్యం సేకరణకు సర్కార్ కసరత్తులు ప్రారంభం.!
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి కోతలు షురూ అయిన నేపథ్యంలో ఎఫ్‌సీఐ నిబంధనల మేరకు ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి వేము ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో 10.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. రైస్ మిల్లులకు, కొనుగోలు కేంద్రాలకు 9.0 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ప్రణాళికలు రూపొందించామన్నారు.
జిల్లాలో 458 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామని, జిల్లా వ్యాప్తంగా 271 రైస్ మిల్లుల ద్వారా సేకరణకు అనుమతిచ్చినట్లు తెలిపారు. పట్టాదార్ పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను ధాన్యంతో పాటు రైతులు కొనుగోలు కేంద్రాల్లో సమర్పిస్తే రెండు, మూడు రోజుల్లో ధాన్యం మొత్తానికి డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేయడానికి వీలవుతుందని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలును కొన్ని సంవత్సరాల క్రితమే నిలిపివేసినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం రైతులకు అండగా నిలిచిందని తెలిపారు.
ఈ వాన కాలంలో ధాన్యం దిగుబడి 10 లక్షల 66 వేల మెట్రిక్ టన్నులు వస్తుందని అధికారులు అంచనా వేస్తుండగా 24 గంటల కరెంటుతో, పుష్కలంగా వర్షాలతో చెరువులు ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నందున ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుందని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇందులో కనీసం 9 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ధాన్యం సేకరణ కోసం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి రైతులకు కనీస సదుపాయాలు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను 2.25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉన్నందున ప్రస్తుతం ఉన్న 76 లక్షల గన్నీ బ్యాగులను కవర్ చేసుకుంటూ ఎక్కడ కూడా కొరత రాకుండా చూడాలని అధికారులను కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి రైతుల నుండి ఒక ప్రణాళిక ప్రకారం రైస్ మిల్లులకు ట్యాగింగ్ చేసి ఎప్పటికప్పుడు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని రైతు మిల్లులకు పంపించాలన్నారు. రైస్ మిల్లులలో కడ్తా పేరుతో అధిక ధాన్యాన్ని తీసుకోవడాన్ని కట్టడి చేయాలని ఆదేశించామన్నారు. రవాణా సమస్యలు లేకుండా లారీ కాంట్రాక్టర్లతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.
ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని తేవాలని వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్ర మిశ్రా, అదనపు సీపీ అరవింద్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి, డీసీఓ సింహాచలం, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర రావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, పోలీసు, రవాణాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- focus
- Government