- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘రాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ ప్రోత్సహిస్తున్నట్లగా ఉంది ’
దిశ, కరీంనగర్ సిటీ : అనేక మంది ముస్లీం యువకులు పేద హిందూ అమ్మాయిలే లక్ష్యంగా వారిని ప్రేమ పేరుతో లొంగతీసుకుటున్నా, రాష్ట్ర ప్రభుత్వం వీటిని అడ్డుకోవడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ చౌక్లో ప్రభుత్వ దిష్టి బొమ్మని దగ్ధం చేశారు. ప్రేమ పేరుతో ముస్లీ యువకులు హిందూ అమ్మాయిలని లొంగ దీసుకుని బలవతంగా మత మార్పిడికి పాల్పడుతూ,బురఖాలు కప్పుతున్నారని మండిపడ్డారు.
కొన్ని చోట్ల మత మార్పిడికి అంగీకరించని యువతులను కిడ్నాప్ చేస్తూ, వారిపై హత్యా యత్నాలకు కూడా పాల్పడుతున్నారని ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్వవహరిస్తుందన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు పరోక్షంగా ముస్లిం యువతను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉన్నదని, ప్రభుత్వం ఇదే తీరు అనుసరిస్తే, రాబోయే రోజుల్లో హిందువుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని భజరంగ్ దళ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు తోట ప్రదీప్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని హెచ్చరించారు.
నాటకీయ పద్ధతిలో దిష్టిబొమ్మ దగ్ధం..
భజరంగదళ్ కార్యకర్తలు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు, పోలీసులు తెలంగాణ చౌక్లో భారీ బలగాలను మోహరించారు. ఇది గమనించిన ఆ సంఘం నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి, ఒక గ్రూపు ఆందోళన చేస్తూ పోలీసుల ఎదుటకు రాగా, మరో గ్రూపు పోలీసుల వెనకనుంచి వచ్చి దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. ఒక్కసారిగా మంటలు భగ్గుమనడంతో వెను తిరిగి చూసిన పోలీసులు అవాక్కై వెంటనే తేరుకుని, మంటలు ఆర్పివేశారు. కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు.