- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆన్లైన్ వ్యాపారానికి గ్లోబల్ లింకర్
దిశ, తెలంగాణ బ్యూరో: వేలాది మంది వ్యాపార యజమానులతో ఆన్లైన్లో కనెక్ట్ అయ్యేందుకు ఎంఎస్ఎంఈ రంగానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం గ్లోబల్ లింకర్, సపియో అనలైటిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆ సంస్థలతో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సోమవారం ఒప్పందాలపై సంతకాలు చేశారు. గ్లోబల్ లింకర్ కో ఫౌండర్, సీఈఓ సమీర్ వకిల్, అక్లౌడ్ టెక్నాలజీస్ సీఓఓ అమిత్ పావ్, సపియో అనలైటిక్స్ సీఈఓ అశ్విన్ శ్రీవాత్సవ, గ్లోబల్ లింకర్ అసోసియేట్ డైరెక్టర్ మాళవిక జగ్గిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ రంగ యజమానుల కోసం రాష్ట్ర గ్లోబల్ లింకర్ (http://www.ts-msme.globallinker.com) ను ఆవిష్కరించారు. ఇందులో సాఫ్ట్‌వేర్‌ను సపియో అనలైటిక్స్ రూపొందించింది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లోనూ చూడొచ్చు. దీని ద్వారా వ్యాపారాన్ని విస్తరించొచ్చు. అమ్మకాలు, కొనుగోళ్లు, కొత్త వస్తువుల ఉత్పత్తిని సాధించే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ఇది స్థానిక ఎంఎస్ఎంఈ రంగానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వారి లక్ష్యాలను చేరుకునేందుకు ప్లాట్ ఫారం బాగుంటుందన్నారు.