- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google Meet: గూగుల్ మీట్ లైవ్ స్ట్రీమింగ్‌లో న్యూ ఫీచర్స్
దిశ, ఫీచర్స్ : టెక్ దిగ్గజం గూగుల్ తమ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ‘గూగుల్ మీట్’లో యూజర్లు తమకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మార్చుకునే వెసులుబాటును ఇటీవలే అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ మీట్ ‘క్రాస్ డొమైన్ లైవ్ స్ట్రీమ్’, ‘క్యాప్షన్స్’ అనే మరో రెండు ఫీచర్లను యాడ్ చేసింది. ఈ ఆప్షన్స్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ మరింత మెరుగుపడనుండగా, ఈ ఆప్షన్స్ యూజర్లకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
ప్రస్తుతం గూగుల్ మీట్ వీడియో ఫుటేజ్ లైవ్ స్ట్రీమ్ అందిస్తే కేవలం సొంత ఆర్గనైజేషన్‌కి సంబంధించిన గెస్ట్‌లు మాత్రమే చూడగలిగేవాళ్లు. అయితే గూగుల్ అందిస్తున్న న్యూ ఆప్షన్ ‘క్రాస్ డొమైన్ లైవ్ స్ట్రీమ్’ ద్వారా ఒక సంస్థ హోస్ట్ చేసిన ప్రత్యక్ష ప్రసారాలకు విశ్వసనీయ డొమైన్‌లలోని వినియోగదారులను కూడా ఆహ్వానించవచ్చు. అంటే ఇతర ఆర్గనైజేషన్‌కి చెందినవారైనా స్ట్రీమింగ్ చూడొచ్చని అర్థం.
లైవ్ స్ట్రీమింగ్ జరుగుతున్నప్పుడు ఆ మాటల్ని అప్పటికప్పుడు అక్షరాల రూపంలో ఇవ్వడాన్ని ‘లైవ్ స్ట్రీమ్ క్యాప్షన్స్’ అంటారు. గూగుల్ మీట్ వీడియో కాల్స్ కోసం ఇప్పటికే శీర్షికలు అందుబాటులో ఉండగా తాజా అప్‌డేట్‌లో లైవ్ స్ట్రీమింగ్‌లోనూ ఈ ఆప్షన్‌ను ఇంట్రడ్యూస్ చేసింది గూగుల్. దీంతో యూజర్ ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ట్ చేసేటప్పుడు శీర్షికలను కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిస్, పోర్చుగీస్ భాషల్లో మాత్రమే క్యాప్షన్స్ కనిపిస్తాయి. చెవుడు, వినికిడి లోపం, సౌండ్ అలర్జీకి గురయ్యే వారికి ఈ లైవ్ క్యాప్షన్స్ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్ చెబుతోంది. అలాగే ఆడియో ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి క్యాప్షన్ల సౌకర్యం దోహదపడుతుందని గూగుల్ యాజమాన్యం తెలిపింది. వినడం కంటే టెక్స్ట్ చదవడానికి ప్రాధాన్యతనిచ్చే యూజర్స్‌కు కూడా ఇది ఉపయోగకరమైన ఫీచర్.
ప్రస్తుతం ఈ సేవలను పెద్ద పెద్ద గ్రూపు ఎంప్లాయిస్ కోసం వినియోగిస్తుండగా, ఒక్కో మీటింగ్‌లో పది వేల నుంచి లక్ష మంది వినియోగదారులు ఉంటారని గూగుల్ చెబుతోంది. ఈ ఫీచర్స్ గూగుల్ వర్క్‌స్పేస్ ఎంటర్‌ప్రైజ్ స్టాండర్డ్, ఎంటర్‌ప్రైజ్ ప్లస్, టీచింగ్ అండ్ లెర్నింగ్ అప్‌గ్రేడ్, ఎడ్యుకేషన్ ప్లస్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.