- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కోసం గూగుల్ సాయం ఎంతంటే!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధాన్ని కొనసాగించేందుకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సిద్ధమైంది. చిన్న, మధ్య తరహా సంస్థలను ఆదుకునేందుకు దాదాపు రూ. 5,990 కోట్లను ప్రకటించింది. వీటితో పాటు ఆరోగ్య కేంద్రాలకు, ఆరోగ్య రక్ష కార్యకర్తలకు, ప్రభుత్వలకు ఈ సహాయాన్ని ఇవ్వాలని గూగుల్ సీఈవో సుందర్ తెలిపారు. వీటన్నిటితో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు అన్ని ప్రభుత్వాలకు దాదాపు రూ. 1,870 కోట్ల విలువ యాడ్స్ గ్రాంట్‌ను అందిస్తామని గూగుల్ ప్రకటించింది.
అలాగే, కరోనాను అడ్డుకునేందుకు వ్యక్తిగత రక్షణ పరికరాలు, వైద్యం కోసం ఉపయోగించే ఇతర ఉత్పత్తులను పెంచేందుకు పూర్తీ సాయాన్ని ఇస్తామని వెల్లడించింది. రానున్న కాలంలో సుమారు 30 లక్షల మాస్కుల ఉత్పత్తి కోసం ఓ సంస్థతో కలిసి పనిచేయనున్నట్టు పేర్కొంది.
Tags :coronavirus, covid-19, epidemic, google, health workers, pandemic, sundar pichai