- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్రీన్ టీ పరిచయం చేసిన సైంటిస్ట్‌కు.. గూగుల్ డూడుల్ నివాళి!
దిశ, ఫీచర్స్ : గ్రీన్ టీలో సమృద్ధిగా ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటాక్సిడెంట్లు పలు రకాల వ్యాధులు రాకుండా నిరోధిస్తాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడి కావడంతో పాటు బరువు తగ్గుతారనే కారణం వల్ల ఇటీవల కాలంలో ఇది తాగే వారి సంఖ్య పెరిగింది. ప్రపంచానికి ఈ ఔషధ పానీయాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆమె జపనీస్ విద్యావేత్త, బయోకెమిస్ట్ మిచియో సుజిమురా. ఈ రోజు ఆమె 133 వ జయంతి సందర్భంగా గూగుల్ ఆమె డూడుల్‌తో నివాళులు అర్పించింది.
మిచియో సుజిమురా 1888లో జపాన్‌లోని ఒకేగావాలో సెప్టెంబర్ 17న జన్మించారు. స్కూల్ చదువులు పూర్తయ్యాక టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీలో మిచియో బయోకెమిస్ట్రీలో రీసెర్చ్ చేసిన ఆమె, 1932లో వ్యవసాయంలో డాక్టరేట్ పట్టా పొందిన తొలి జపాన్ మహిళగా మిచియో సుజిమురా ఘనత సాధించింది. ఈ క్రమంలోనే డాక్టర్ ఉమెటారో సుజుకీతో కలిసి ఆమె గ్రీన్ టీపై బయోకెమిస్ట్రీపై పరిశోధన ప్రారంభించారు. వారి ఉమ్మడి పరిశోధనలో గ్రీన్ టీలో గణనీయమైన మొత్తంలో విటమిన్ సి ఉందని తేలింది. గ్రీన్ టీలో ఇంకా తెలియని అనేక పరమాణు సమ్మేళనాలున్నాయని అవి ఆరోగ్యాన్ని కాపాడటంలో సాయపడతాయని గుర్తించారు.
1929 నుంచి ఒంటరిగానే గ్రీన్‌టీ మరిన్ని పరిశోధనలు చేసిన సుజిమురా, గ్రీన్ టీలో ఫ్లవనాయిడ్ కాటెచిన్ ఉన్నట్లు గుర్తించగా, ఆ మరుసటి ఏడాది గ్రీన్ టీలో ఉన్న టానిన్‌ను దాన్నుంచి వేరు చేసింది. ఈ పరిశోధన ఆధారంగా ‘ఆన్ ది కెమికల్ కాంపోనెన్‌ట్స్ ఆఫ్ గ్రీన్ టీ’ పేరుతో థీసిస్ రూపొందించింది. గ్రీన్ టీలో ఉండే పోషక విలువలను ప్రపంచానికి తెలియజేసిన ఆమె, విద్యావేత్తగానూ పేరు సంపాదించుకుంది. 81ఏళ్ల వయసులో సుజిమురా కన్నుమూసింది.